జీవా కాజల్..'ఎంత వరకు ఈ ప్రేమ'

రంగం సినిమా తరువాత సరైన సినిమా పడలేదు జీవాకు. ఆ లోటు తీరడం కోసం చేస్తున్న గట్టి ప్రయత్నం కవలై వేండాం. ఈ సినిమాను తెలుగులోకి కూడా సమాంతరంగా డబ్ చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా జీవా చేస్తున్న ఈ సినిమాకు ఎంతవరకు ప్రేమ అని టైటిల్ ఫిక్స్ చేసారు. తమిళంలో యామిరిక్కు భయమే లాంటి చిన్న హర్రర్ సినిమా తీసి పెద్ద విజయం సాధించిన డికే ఈ సినిమాకు దర్శకుడు. 

తొలిసినిమా హర్రర్ కామెడీ అయితే ఈ మలి సినిమా రొమాంటిక్ కామెడీ. ఈ సినిమాను నిర్మాత డి.వెంకటేష్ తన డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అందిస్తున్నారు. ఈ సినిమా కూడా తెలుగు, తమిళంలో దసరా సీజన్ కు కాస్త అటు ఇటుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రంగం నిర్మాత ఎల్రెడ్ కుమార్ తమిళంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో  బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Show comments