టీడీపీ అవినీతి వ్యవహారాలు.. మోడీ, జగన్ ఖాతాలకు!

ఒకవైపు మోడీని అడ్డం పెట్టుకుంటున్నారు. మోడీ మా వాడు అంటున్నారు. బీజేపీ- తెలుగుదేశం పార్టీల మధ్య బంధం తెంపితే తెగేది కాదని అంటున్నారు. ఇంకోవైపు.. చంద్రబాబుపై మోడీ కుట్రలు చేస్తున్నాడనీ అంటున్నారు. ఇంతకీ తెలుగుదేశం నేతల , ఆ పార్టీ వీరాభిమానుల ఘోష ఏమిటో అర్థం కావడం లేదు.

ఆ మధ్య అవినీతిలో జాతీయ స్థాయిలో ఏపీకి నంబర్ వన్ ర్యాంకు రాగానే.. అదంతా మోడీ కుట్ర అనే మాటే వినిపించింది తెలుగుదేశం వైపు నుంచి. బాబు ఆధ్వర్యంలో ఏపీ దూసుకెళ్లిపోతుంటే చూసి ఓర్వలేక మోడీ ఇలాంటి అధ్యయన ఫలితాలను విడుదల చేయిస్తున్నాడంటూ డిఫెండ్ చేసుకో ప్రయత్నించాయి పచ్చచొక్కాలు. మరి మోడీ అంత దుర్మార్గుడు అయితే.. ఆయన ఆధ్వర్యంలోని పార్టీని పట్టుకు తెలుగుదేశం ఎలా వేలాడుతోందో అంటే మాత్రం అదంతా లోక కల్యాణం కోసం అంటారు!

ఇక తాజాగా తెలుగుదేశం ఎమ్మెల్యే ఐదు కోట్ల రూపాయల లంచం వ్యవహారం కూడా మోడీ కుట్రే అనే మాటా వినిపిస్తోంది. మోడీ ఇచ్చిన ధైర్యంతోనే ఆ కాంట్రాక్టర్లు ఈ వ్యవహారాన్ని బయటపెట్టారని.. కాబట్టి ఇదంతా మోడీ కుట్రే అని  వీళ్లు చెబుతున్నారు. అంటే వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేది కాదు తప్పు! ఇదంతా మోడీదే!

ఇక మరో ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి  ఇంటిపై ఐటీ దాడులు జరిగితే.. దీన్ని జగన్ ఖాతాలో వేస్తున్నారు తమ్ముళ్లు. జగన్ ఆస్తుల కేసులో వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని.. జనాల్లోకి వెర్రెక్కించే యత్నం చేస్తున్నారు. మరి జగన్ ఆస్తుల కేసులోనే ఇవి జరిగి ఉంటే.. ఆ మేరకు ఐటీ అధికారుల చేత ఎందుకు ప్రకటన చేయించలేదు? ఆ కేసులో నిందితుడిని తెలుగుదేశం లో ఎందుకు పెట్టుకున్నట్టు? ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చినట్టు? ఇప్పుడు పార్టీలో ఎలా కొనసాగిస్తున్నట్టు? అనే అంశాలను ఎవరూ ప్రస్తావించరు అని ఈ వెర్రి తమ్ముళ్ల ఫీలింగు!

మొన్నటి వరకూ ఏదో వంక పెట్టుకుని ఎదుటి వాళ్లపై బురద చల్లేసే వాళ్లు.. ఇప్పుడు తమ బొక్కలు బయటపడుతున్నా.. వీటి బాధ్యతనూ ఎదుటి వాళ్లపైకి అప్పగించేస్తూ ఆ విధంగా ముందుకు పోతున్నారనమాట.

Show comments