చంద్రబాబూ.. తుగ్లక్‌ కూడా సిగ్గుపడాలేమో.!

ఓ పక్క దేశ జనాభా పెరిగిపోతోంది మొర్రో.. అంటూ గణాంకాలు చెబుతోంటే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు 'పిల్లల్ని కనండి.. అవసరమైతే ఎక్కువమందిని కనండి..' అంటూ పిలుపునిస్తున్నారు. కటకటా.. ఆయన చంద్రబాబా.? లేదంటే తుగ్లక్కా.? అని డౌట్‌ రావడం ఖాయం. ఇందులో డౌటేమీ లేదు, చంద్రబాబు ఈ మధ్య తుగ్లక్‌ ఆలోచనలే చేస్తున్నారు మరి.! 

ముందు కెరీర్‌, ఆ తర్వాతే పెళ్ళి పిల్లలు.. అంటోంది నేటి యువత. మారుతున్న కాలానికనుగుణంగా యువత ఆలోచనల్లో చాలా మార్పులొచ్చేశాయి. ఇదివరకటిలా ఇరవయ్యేళ్ళకే పెళ్ళిళ్ళు చేసేసుకుని, పిల్లల్ని కనేయడంలేదు. పాతికేళ్ళు దాటితేనేగానీ, పెళ్ళి గురించి ఆలోచించని పరిస్థితి. సరే, అందరూ అని కాదనుకోండి.. అది వేరే విషయం. కానీ, చంద్రబాబు 'పిల్లల్ని కనండహో..' అంటూ నెత్తీనోరూబాదుకుంటున్నారు చిత్ర విచిత్రంగా. 

జపాన్‌లో ముసలివాళ్ళు ఎక్కువట.. అది నిజమే. మనదేశానికి యువతే వెన్నెముక.. ఇదీ నిజమే. ప్రస్తుతం దేశ జనాభాలో యువత, కొత్తగా జన్మిస్తోన్నవారు.. ఇలా నిష్పత్తులన్నీ సరిగానే వున్నాయి. ఆ మాటకొస్తే, పుట్టేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే వుంది. ఇంకొన్నేళ్ళలో చైనా జనాభాని మించిపోతామేమో.. అన్న అనుమానాలు ఓ పక్క విన్పిస్తున్న వేళ, చంద్రబాబు 'పిల్లల్ని ఎక్కువగా కనేయండి..' అంటోంటే అందరూ విస్మయానికి గురవ్వాల్సి వస్తోంది. 

వందల కోట్లు ఖర్చు చేసి దేశంలో 'కుటుంబ నియంత్రణ'పై అవగాహనా కార్యక్రమాల్ని చేపడుతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలోనూ ఆ అవగాహనా కార్యక్రమాలు గట్టిగానే జరిగాయి. ఇప్పుడే కొత్తగా చంద్రబాబు మదిలోకి ఇలా తుగ్లక్‌ ఆలోచనలు వస్తున్నాయి. అయినా 'పిల్లల్ని కనండి మొర్రో..' అని చంద్రబాబు దేబిరించడమేంటంట కామెడీ కాకపోతే.? ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాటలా ఇవి.? సిగ్గు సిగ్గు.!

Show comments