ఇక మళ్లీ ఎప్పటికీ రీమేక్ సినిమా చేయనని ప్రకటించేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. రీమేక్ చేసిన థని ఒరువన్ ను ధృవ గా థియేటర్లలో చూడక ముందే, రీమేక్ సినిమాల మీద సురేందర్ రెడ్డి ఇలాంటి కీలకమైన డెసిషన్ ఎందుకు తీసుకున్నట్లో? మరోపక్క ధృవ సినిమాలో చిన్న చిన్న చేంజెస్ చేసాను తప్ప, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ గా తీసేసానని అంటున్నాడు.
ఇలా తీయాలని అనుకుని తీసేసాడా? లేక తీయమని ప్రెజర్ నా? మార్పులు కూడా సురేందర్ అభిరుచి మేరకా? చరణ్ హీరోయిజానికి అనుగుణంగానా? ఇదిలా వుంటే ధృవ ద్వితీయార్థం కాస్త స్లోగా వుందని గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించడం స్టార్ట్ అయింది. దీనికి తోడు ఇప్పుడు సురేందర్ ఇలా రీమేక్ ల మీద విరక్తిగా మాట్లాడితే, అది మరిన్ని రాంగ్ సిగ్నల్స్ ను పంపించే ప్రమాదం వుంది.
అయినా ఓ రీమేక్ సినిమా చేసి, అది విడుదల కాకుండానే, మళ్లీ ఇంకెప్పుడు రీమేక్ లు చేయమని సురేందర్ రెడ్డి ప్రకటించడం సరైన స్టేట్ మెంట్ కాదేమో?