రెండున్నరేళ్ల తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి వర్గ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోయే కొత్త మంత్రుల పేర్ల జాబితాను సిఎం ప్రకటించారు. నారా లోకేశ్( చిత్తూరు), భూమా అఖిలప్రియ(కర్నూలు), కళా వెంకట్రావు(శ్రీకాకుళం), అమర్‌నాథ్ రెడ్డి(చిత్తూరు), ఆదినారాయణ రెడ్డి(కడప), కాల్వ శ్రీనివాసులు(అనంతపురం), నక్క ఆనంద్‌బాబు(గుంటూరు), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(నెల్లూరు), సుజయ్ కృష్ణ రంగారావు(విజయనగరం), జవహర్(పశ్చిమగోదావరి), చాంద్‌బాషా (అనంతపురం) పేర్లు ఈ జాబితాలో వున్నాయి.
అయితే ఎవర్ని తప్పిస్తారు? ఎవరి శాఖలు మారుస్తారు అన్నది ఇంకా తెలియాల్సి వుంది.