52 రోజులైనా తొలగని నగదు కష్టాలు..ఎటీఎమ్ లు అందుబాటులోకి రాక జనాల ఇబ్బందులు..ఫింఛన్ల కోసం బ్యాంకుల దగ్గర వృద్ధుల పడిగాపులు.
ఇంత భయంకరమైన సీన్ ఎక్కడంటారా? తెలంగాణలో మాత్రమే. ఆంధ్రలో మాత్రం కాదు. కావాలంటే చంద్రబాబుగారి కి ఇష్టమైన దినపత్రికను గత నెల రోజులుగా చూడండి..వీలయినంత వరకు ఫస్ట్ పేజీలో లేకుంటే లోపలి పేజీల్లో ఇలాంటి నోట్ల కష్టాల కథనాలు కనిపిస్తాయి. మీకు అవకాశం వుంటే నెట్ లో అదే నెల రోజుల ఆంధ్ర ఎడిషన్లు చదవండి. తేడా మీకే తెలుస్తుంది.
నగదు కష్టాలు దేశం అంతా ఒక్క మాదిరిగానే వున్నాయి. ఒక దగ్గర ఎక్కవా లేదు..మరో దగ్గర తక్కువా లేదు. ఆన్ లైన్ లావాదేవీలకు ఎక్కవ అవకాశం వున్న అర్బన్ ప్రాంతాల్లో కూడా ఈ సమస్య తక్కువేమీ కాదు. కానీ తెలంగాణలో ఎక్కువ వున్నట్లు నిత్యం వార్తలు ప్రచురిస్తూ, ఆంధ్రలో అసలు ఆ సమస్యలే లేనట్లు అలాంటి వార్తల జోలికి వెళ్లకపోవడం అంటే ఏమనుకొవాలి? బాబుగారి మనసెరిగి వార్తలు రాయడం అనుకోవాలి తప్ప వేరు కాదేమో?