రాజుగారి గది-2లో కాజల్.. నిజంగా ఇది నిజమేనా?

ఐటెంసాంగ్ చేసిన కాజల్ కు, రాజుగారి గది-2లో ఓ చిన్న పాత్రలో కనిపించడం పెద్ద సమస్య కాబోదు. కానీ అందరికీ డౌట్ రావడానికి కారణం ఇది నాగార్జున సినిమా. అందుకే కాజల్ ఎంట్రీపై అన్ని అనుమానాలు.

అక్కినేని కాంపౌండ్ కు కాజల్ చాలా దూరమనే విషయం పరిశ్రమలో పబ్లిక్ సీక్రెట్. దడ సినిమా టైమ్ లో నాగచైతన్య, కాజల్ మధ్య అభిప్రాయబేధాలొచ్చిన విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. ఆ సినిమా ప్రమోషన్ కు కూడా కాజల్ డుమ్మా కొట్టేసింది. ఎంతో బలవంతం చేయగా ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చింది.

ఆ తర్వాత నాగార్జున ఆఫర్ చేసిన ఓ క్యారెక్టర్ ను కూడా కాజల్ తిరస్కరించింది. ఈ రెండు ఘటనలతో అక్కినేని కాంపౌండ్ కు ఆమె పూర్తిగా దూరమైంది. దడ తర్వాత చైతూ మళ్లీ ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. నాగ్ కూడా కాజల్ ను కన్సిడర్ చేయలేదు. ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ ఎవరి దారి వాళ్లదన్నట్టు వ్యవహరించారు.

ఇలాంటి టైమ్ లో రాజుగారి గది-2 ప్రాజెక్టులోకి కాజల్ ఎంటర్ అయిందనే వార్త అక్కినేని ఫ్యాన్స్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సినిమాలో కాజల్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే ఈ సినిమాలో సమంత, సీరత్ కపూర్ నటిస్తున్నారు.

Show comments