ఉరిమి ఉరిమి బిరియానీ మీద..

ఎక్కడో స్విచ్చేస్తే, మరెక్కడో లైట్ వెలిగినట్లుంది వ్యవహారం. జల్లికట్టు క్రీడ వద్దని కోర్టు చెబితే, నటుడు కమల్ హాసన్ అలా అయితే బిరియానీని కూడా బ్యాన్ చేయాలంటున్నారు. అంటే ఆయన అయిడియా మరేమీ కాదు. జల్లికట్టు జంతు హింస అయితే, బిరియానీలో వాడే చికెన్, మటన్ లు కూడా జంతు హింసే కదా? అని అయివుంటుంది.

అయినా ఓ యాంగిల్ లో చూస్తే ఆయన చెప్పినదీ పాయింటే. ఈ భూ ప్రపంచంలో జంతు హింస జరగని ప్రదేశం..జరగని సమయం ఎక్కడని? బిరియానీ కోసమో, కూర కోసమో, కోడి పీక, గొర్రె, మేక పీకో కోయడం పరమ హింసే కదా? ఆవునో, పందినో వధించడం కూడా హింసే కదా? నిజానికి జల్లికట్టు లేదా కోడి పందాలు ఏడాదికి ఓ సారి మాత్రమే జరుగుతాయి. కానీ నిత్యం లక్షలాది మూగ జీవాల గొంతులు కోస్తూనే వున్నాం కదా?

అది ఆహారం కోసం అని సరిపెట్టుకుంటున్నాం. కానీ కమల్ లాంటి వాళ్లు, జల్లికట్టు అనేది ఆచారం కోసం అని సరిపెట్టుకోమంటున్నారు. పైగా అక్కడ పశువులు చావడం లేదు. జస్ట్ వాడితో ఆడుతున్నారంతే అంటున్నారు. ఏమైనా ఇలా జల్లికట్టు, కోడి పందాల వ్యవహారాలు చినికి చినికి గాలివానై నాన్ వెజ్ తినేవాళ్ల గొంతుకు అడ్డం పడేలా వున్నాయి.

Show comments