డేరింగ్ స్టెప్: టీడీపీ నుంచి వైసీపీలోకి!

తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టుగా ప్రకటించారు గంగుల ప్రభాకర్ రెడ్డి. కార్యకర్తలకు న్యాయం చేయడానికి, రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడానికి వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నట్టుగా ఆయన తెలిపారు. చంద్రబాబు పిలుపు మేరకే తాము గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశంలో చేరామని ఆయన అన్నారు. అయితే.. చంద్రబాబు తమకు మోసం చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు ఆజ్ఞలను శిరసా వహించినా ప్రయోజనం లేకపోయిందని.. తమ అనుచరుల కోరిక మేరకు వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నట్టుగా ఆయన తెలిపారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దాదాపు మూడు దశాబ్దాలుగా భూమా ఫ్యామిలీకి గట్టిపోటీ ఇస్తూ.. అడపాదడపా వారిపై పై చేయి సాధిస్తూ వచ్చింది గంగుల కుటుంబం. 2004 లో కాంగ్రెస్ తరపు నుంచి గంగుల ప్రతాపరెడ్డి విజయం సాధించాడు. భూమా కుటుంబం ఆది నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. 2009 సమయంలో మాత్రం వారు ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు.

2014 ఎన్నికల ముందు భూమా శోభా నాగిరెడ్డి మృతి చెందిన విజయం తెలిసిందే. ఆమె మరణం నేపథ్యంతో జరిగిన ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి ఉత్సాహం చూపించినా, శోభ తనయ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. వైకాపా తరపు నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి కుటుంబం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపాలో ఏర్పడిన లోటును గంగుల కుటుంబం సద్వినియోగం చేసుకుంటోంది!

అయినా.. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. వీరు అధికార పార్టీని వీడి వస్తుండటం విశేషమే. అందునా అధికారం చేతిలో ఉన్న భూమా వర్గం నుంచి ప్రతీకారదాడులు ఉంటాయని తెలిసినా.. గంగుల ఫ్యామిలీ డేరింగ్ స్టెప్ వేస్తున్నట్టే. అధికారంలో ఉన్న పార్టీని వదిలి.. రెండేళ్ల ముందే ప్రతిపక్షంలోకి వస్తున్న గంగుల ఫ్యామిలీ నుంచి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి వైకాపా తరపున పోటీ చేయవచ్చు. మొత్తానికి పాతప్రత్యర్థులు కొత్త యుద్ధం ఇక! Readmore!

Show comments

Related Stories :