సినిమా వెంకన్న బానే వున్నాడు

ఎన్టీఆర్ వున్నపుడు, మరణించిన తరువాత కూడా తెలుగులో కృష్ణ, రామ, విష్ణుమూర్తి లాంటి పాత్రలు వేయడానికి వేరేవాళ్లని ఆలోచించడం అంటేనే భయం. అలాంటిది ఆ రోజుల్లోనే బాపు రమణలు శోభన్ బాబును, దాసరి నారాయణరావు, రామకృష్ణను ఆ పాత్రల్లో చూపించిన ప్రేక్షకులను ఒప్పించారు. 

అన్నమయ్య సినిమాలో ఎవరు ఊహించని రీతిలో సుమన్ ను వెంకటేశ్వరునిగా చూపించి రాఘవేంద్రరావు తన మార్కు చూపారు. ఇప్పుడు మళ్లీ మరోసారి తెలుగు తెరకు దేవుడి పాత్ర పోషించే నటుడు కావాల్సి వచ్చాడు. కానీ ఈసారి తెలుగువాళ్లు ఎవరూ సెట్ కాలేదు. అందుకే రాఘవేంద్రరావు తన నమో వెంకటేశాయ సినిమాకు వెంకన్నగా బాలీవుడ్ నటుడిని ఇంపోర్ట్ చేసారు. 

సౌరభ్ రాజ్ జైన్ అనే ఈ నటుడు ఇప్పటికే కొన్ని దేవుళ్ల పాత్రలను పోషించాడు. మన జనాలు ఎలా ఎక్సెప్ట్ చేస్తారో? లేదా ఇప్పటి నుంచి చూసి చూసి అలవాటు పడతారనో, ముందుగా ఫస్ట్ లుక్ వదిలేసారు. రాఘవేంద్రరావుకు మేకప్ చమత్కారం బాగా వచ్చు. అందుకే శౌరభ్ వెంకటేశ్వరునిగా బానే వున్నారు. 

Show comments