పవన్‌ ఫ్యాన్సా? ఐసిస్‌ తీవ్రవాదులా?

రాష్ట్రంలో పవనిజం కాస్త తీవ్రవాదం స్థాయిలోనే ఉన్నది. దాన్ని కాదనడానికి వీల్లేదు. కానీ వాళ్లందరూ కూడా రాష్ట్రం పట్ల , రాష్ట్ర ప్రగతి పట్ల సదభిప్రాయం, సానుకూల అభిప్రాయం, మంచి కోరికలు మాత్రమే ఉన్న భావాలకు ప్రతినిదులు. వారిని తీవ్రవాదులతో పోల్చడం మాత్రం సరికాదు. కానీ ఈ వ్యాఖ్య ఏమిటి? ''పవన్‌ ఫ్యాన్సా ఐసిస్‌ తీవ్రవాదులా'' అనే మాట ఎవరు అనగలరు... ధైర్యంగా? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. 

కానీ.. పవన్‌ ఫ్యాన్స్‌ గురించి ఈ డైలాగు ఎవరో వేసినది కాదు. తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ సభా ప్రాంగణానికి సమీపంలో ఒకరు ఇలాంటి నినాదం రాసిన పోస్టరును చేతిలో పట్టుకుని నిల్చున్నారు. అసలే తిరుపతి నగరం యావత్తూ ప్రస్తుతం పవన్‌ మేనియా నడుస్తున్న సమయంలో.. ఇలాంటి పవన్‌ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించే నినాదంతో ఉన్న పోస్టరుతో ఓ వ్యక్తి ఉండడం ఆసక్తికరమైన అంశమే. 

అయితే పవన్‌ ఫ్యాన్స్‌ను, ఐసిస్‌ ఉగ్రవాదులతో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న సదరు వ్యక్తి ఎందుకలా చేశారన్నది మాత్రం తెలియలేదు. ఆయన పవన్‌ ఫ్యాన్స్‌ వల్ల ఏం ఇబ్బంది పడ్డారో.. ఏం ఆశించి అలాంటి పోస్టరు పట్టుకుని అలా స్టేడియం వద్ద  నిల్చున్నారో మాత్రం అర్థం కాలేదు. ఎవరూ ఆయనతో తగాదా పెట్టుకోకపోయినా.. ఆసక్తిగా చూస్తూ వెళుతుండడం విశేషం. 

Show comments