పొగరు ఒంట్లో హీరోయిజం ఇంట్లో: 'ఖైదీ'

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలోని డైలాగ్‌ని దర్శకుడు వినాయక్‌, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రివీల్‌ చేశాడు. విలన్‌ - హీరో మధ్య వచ్చే డైలాగ్‌ ఇది. నీ పొగరేంటి? నువ్వేమన్నా హీరోవనుకున్నావా? అని విలన్‌, హీరోని ప్రశ్నిస్తే, 'పొగరు నా ఒంట్లో వుంది.. హీరోయిజం నా ఇంట్లో వుంది..' అని హీరో చిరంజీవి చెబుతాడట. 

'ఇంకా సూపర్‌ డైలాగులు సినిమాలో చాలానే వున్నాయి.. అవన్నీ తెరపై చూస్తేనే బావుంటుంది..' అంటున్న వినాయక్‌, చిరంజీవి వయసు 61 కాదు, 21.. అంటూ 'అన్నయ్య' చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్నాడు. చిరంజీవిని చాలా యంగ్‌గా చూపించాననీ, సినిమా అద్భుతంగా వస్తోందని వినాయక్‌ చెప్పుకొచ్చాడు. 

హైద్రాబాద్‌లో జరిగిన మెగాస్టార్‌ పుట్టినరోజు వేడుకల్లో ప్రధాన లోటు చిరంజీవే. ఆయనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. పవన్‌కళ్యాణ్‌ సైతం డుమ్మా కొట్టేశాడు. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, నాగబాబు, సాయిధరమ్‌తేజ, వరుణ్‌తేజ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమ్మ కోరిక మేరకే కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీని స్థాపించామనీ, ఈ సినిమాకి అమ్మే నిర్మాత అనీ, ఆమెకు అండగా తాను వున్నాననీ, మావయ్య అల్లు అరవింద్‌ అన్ని విధాలా సహకరిస్తున్నారని చెప్పాడు రామ్‌చరణ్‌.

Show comments