రజనీకాంత్, కమల్‌హాసన్ తరహాలో ప్రభాస్, బాలీవుడ్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేస్తాడా.? ఇప్పుడిదే చర్చ టాలీవుడ్ సర్కిల్స్‌లో కాస్త గట్టిగానే జరుగుతోంది. 'బాహుబలి' సినిమా సాధించిన విజయమే అందుకు నిదర్శనం.
'బాహుబలి ది బిగినింగ్', 'బాహుబలి ది కంక్లూజన్' చిత్రాలతో ప్రభాస్, టాలీవుడ్ హీరో మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్‌గానూ ఎదిగాడన్నది నిర్వివాదాంశం. కానీ, బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడటమంటే అంత తేలిక కాదు.
టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాలు చేశారు. కానీ, ఎవరికీ అక్కడ ఆశించిన స్టార్‌డమ్ దక్కలేదు. ఈ తరం హీరోల్నే తీసుకుంటే రామ్‌చరణ్ బాలీవుడ్‌లో ప్రయత్నించి విఫలమయ్యాడు.
రానా మాత్రం బాలీవుడ్‌లో కొద్దోగొప్పో సత్తా చాటాడనే చెప్పాలి. మరి, ప్రభాస్ మాటేమిటి.? బాలీవుడ్ గురించి ప్రభాస్ ఏమైనా 'ప్లానింగ్'లోవ ఉన్నాడా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు. ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి 'నో కామెంట్' అంటున్నాడు.
'బాహుబలి' ప్రమోషన్ కోసం బాలీవుడ్‌కి వెళ్ళినప్పుడు, అక్కడి మీడియా ముందు రానా కన్పించినంత యాక్టివ్‌గా ప్రభాస్ కన్పించలేకపోయాడు. ఎందుకంటే, రానా అప్పటికే బాలీవుడ్‌కి, బాలీవుడ్ మీడియాకీ సుపరిచితుడు. ప్రభాస్ అలా కాదు కదా. అక్కడే వచ్చింది సమస్య అంతా.
అయితే ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ప్రభాస్‌కి పిలుపులు బాగానే వస్తున్నాయి. పార్టీలకీ ప్రభాస్‌కి ఆహ్వానం అందుతోంది. ముందుగా బాలీవుడ్ పార్టీలకి అలవాటు పడితే, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా బాలీవుడ్ వాతావరణానికి అలవాటైపోయినట్లేనన్నది బాలీవుడ్ సినీ జనం వాదన.
ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. ఇదెలాగూ హిందీలోకి డబ్ అవుతుంది. 'సాహో' కూడా బాలీవుడ్‌లో సత్తా చాటితే, ఆ తర్వాత ప్రభాస్ - బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా ఓ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి బాలీవుడ్ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడనుకోవాలి.