రానా, బన్నీ కలిసొస్తున్నారు.. ఎలగెలగా..!

ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీకెండ్స్ లో కచ్చితంగా ఏదో ఒక హ్యాంగ్ అవుట్ లో కలవాల్సిందే. అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు ఒకేసారి, ఒకే స్క్రీన్ పైకి వస్తున్నారు. అయితే ఇక్కడ సినిమా బన్నీది, ట్రయిలర్ రానాది. అవును.. బన్నీ సినిమాలో రానా ట్రయిలర్ రిలీజ్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ - డీజే సినిమా రేపు థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో పాటు రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేస్తున్నారు. డీజే సినిమా ఇంటర్వెల్ టైమ్ లో రానా సందడి చేయబోతున్నాడన్నమాట.

బాహుబలి-2 సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ సినిమా ఇంటర్వెల్ టైమ్ లో ప్రభాస్ నటించిన సాహో సినిమా టీజర్ ప్రసారం చేశారు. మొన్నటివరకు బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఈ తరహా ప్రచారం ఉండేది.

ఇప్పుడీ ట్రెండ్ టాలీవుడ్ కు కూడా వచ్చేసింది. అన్నట్టు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ సినిమా ఇంటర్వెల్ టైమ్ లో షారూక్ కొత్త సినిమా ట్రయిలర్ ను ప్రసారం చేయబోతున్నారు.

Show comments