పవన్‌ ఎప్పుడు మాట్లాడతాడు.?

నంద్యాల ఉప ఎన్నికకి సంబంధించి రెండు మూడు రోజుల్లో మాట్లాడతానని సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉద్దానం కిడ్నీ సమస్యపై కలిసిన అనంతరం వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఇప్పుడు పవన్‌ స్పందన గురించి, తెలుగుదేశం పార్టీ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. పవన్‌ తమకే మద్దతిచ్చినట్లుగా భావించాల్సి వుంటుందనీ, ఎందుకంటే పవన్‌ తమకు మిత్రుడనీ, జనసేన తమకు మిత్రపక్షమని ఆల్రెడీ మంత్రి అఖిలప్రియ ప్రకటించేసుకున్నారు. 

సో, పవన్‌ మీడియా ముందుకు రాకపోయినా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ జనసేనని తమ మిత్రపక్షంగా ప్రకటించేసుకున్న దరిమిలా.. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన నష్టం లేదు, కాస్తో కూస్తో లాభం తప్ప. చంద్రబాబుని కాదని, తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడంలేదనీ, ఎవరి మనస్సాక్షి ప్రకారం వారు ఓటేయాలని పవన్‌ పిలునిస్తే మాత్రం టీడీపీ శ్రేణుల ఆశలపై నీళ్ళు చల్లినట్లే అవుతుంది. కానీ, అంత సీన్‌ వుండకపోవచ్చు. 

ఇదిలా వుంటే, మీడియా ముందుకు రావాల్సిందిగా పవన్‌పై మంత్రి అఖిలప్రియ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగోతందన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. పవన్‌ వ్యవహార శైలి చంద్రబాబుకి తెలుసు గనుక, టైమ్‌ చూసి రంగంలోకి దించుతామని అఖిలప్రియకి సర్ది చెబుతున్నారట. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకు తమవైపుకు తిరగాలంటే, పవన్‌ నుంచి సానుకూల ప్రకటన రావాల్సిందేనన్నది మంత్రి అఖిలప్రియ భావన. 

మరోపక్క, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభంతో ప్రచారం చేయించాలని వైఎస్సార్సీపీ భావిస్తోందట. అయితే, ముద్రగడ అందుకు సమ్మతిస్తారా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

Show comments