సుకుమార్ సతాయిస్తున్నాడు : రామ్ చరణ్

ఫిలింమేకింగ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. సుకుమార్ ది కూడా అంతే. ప్రతి ఫ్రేమ్ ను చెక్కుతూ కూర్చుంటాడు. ఎన్ని కాల్షీట్లు వేస్ట్ అయినా, ఎంత ప్రొడక్షన్ ఖర్చు అయినా, అనుకున్న ఔట్ పుట్ వచ్చేంత వరకు వదలడు. ఇప్పుడీ దర్శకుడు టైటిల్ విషయంలో కూడా అదే సాగతీత వ్యవహారం చూపిస్తున్నాడట. ఈ విషయం మేం చెప్పేది కాదు. స్వయంగా రామ్ చరణ్ చెబుతున్నాడు. అందుకే అభిమానులంతా కలిసి అతడిపై ఒత్తిడి పెంచాలని పిలుపునిస్తున్నాడు. 

"ఫ్యాన్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే.. నెల రోజులుగా సుకుమార్ గారిని మా సినిమాకు టైటిల్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓ 4-5 మంచి టైటిల్స్ సుకుమార్ అనుకున్నారు. చాలా బాగున్నాయి. కానీ వాటిలో ఏది ఆయన సెలక్ట్ చేసి బయటపెడతారో తెలీదు. కాబట్టి నా అభిమానులంతా ఏదో ఒక రూపంలో ఆయనపై ఒత్తిడి పెంచి, 5-10 రోజుల్లో టైటిల్ ఎనౌన్స్ అయ్యేలా చూడాలి. సుకుమార్ గారు మాకో టైటిల్ ఇవ్వండి సర్.. ప్లీజ్ హెల్ప్".

సోషల్ మీడియాలో రామ్ చరణ్ పోస్ట్ చేసిన వీడియో సందేశం ఇది. అయితే నిజంగానే రామ్ చరణ్ అంత ఫీల్ అవుతున్నాడా.. సుకుమార్ అంత సతాయిస్తున్నాడా అనేది పెద్ద డౌట్. ఎందుకంటే మెగా కాంపౌండ్ లో టైటిల్ ఫిక్స్ చేసే పని దర్శకుడి చేతిలో ఉండదు. అతడు కేవలం 4-5 ఆప్షన్లు మాత్రమే ఇస్తాడు. ఆ ఆప్షన్స్ లోంచి ఒకటి సెలక్ట్ చేసే అంతిమ నిర్ణయం ఎప్పటికీ మెగా కాంపౌండ్ దే.

అంటే చిరంజీవి, అల్లు అరవింద్, చరణ్.. ఇలా వీళ్లంతా కలిసి నిర్ణయం తీసుకుంటారన్నమాట. అలాంటిది ఇక్కడ రామ్ చరణ్, రివర్స్ లో సుకుమార్ ను "ప్లీజ్ సర్" అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే ఏదో అనుమానం కలుగుతోంది. ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో నిర్మాతలు ఏం చేస్తున్నట్టు..?

Readmore!

Show comments