బాంబు పేల్చిన నికేషా పటేల్.. ఎవడా హీరో..?

బాహుబలి-2 సినిమా చూసి దేశం మొత్తం ఊగిపోతోంది. ఇక టాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరు సినిమాను పొగుడుతున్నారు. రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక హీరో.. ఒకే ఒక్క హీరో రివర్స్ అయ్యాడు. అసలు బాహుబలి-2 సినిమా ఉందా..? ఆ సినిమా దర్శకుడు ఎవరు.. ? అంటూ క్వశ్చన్ చేశాడు.

నిజంగా ఇది షాకింగ్ న్యూసే. టాలీవుడ్ లో ఉంటూ బాహుబలి-2 సినిమా దర్శకుడు ఎవరో తెలీదా.. సినిమాను మెచ్చుకోకపోతే లేదు.. కనీసం యూనిట్ కష్టాన్నయినా గుర్తించాలి కదా.. ఆ హీరో ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ బాంబు పేల్చింది మరెవరో కాదు, పవన్ హీరోయిన్ నికేషా పటేల్. పవన్ సరసన కొమరంపులి సినిమాలో నటించిన నికేషా.. ఈ విధంగా ట్వీట్ చేసింది.

“బాహుబలి-2 చూశావా అని ఓ తెలుగు హీరోను అడిగాను. దీనికి ఆయన సమాధానంగా ఆ సినిమా దర్శకుడు ఎవరు అని నన్ను తిరిగి ప్రశ్నించాడు. ఇంత నిర్లక్ష్యంగా, సిగ్గులేకుండా ఎలా ఉన్నావ్. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది” ఇది నికేషా ట్వీట్ సారాంశం. అయితే ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నికేషాను ట్యాగ్ చేస్తూ చాలామంది హీరోల పేర్లు చర్చకొస్తున్నాయి. అతడు ఓ స్టార్ హీరో అనే విషయం మాత్రం ఇక్కడ క్లియర్.

Show comments