అదిరిందయ్యా బాలయ్యా..! పూరి మార్క్ మేకోవర్

బాలయ్య సినిమాల్లో మేకోవర్ అంటే ఇప్పటివరకు నటసింహం విగ్గులు మాత్రమే చూశాం. బోయపాటి వచ్చిన తర్వాత కాస్త మీసకట్టు మార్చాడు. కానీ కంప్లీట్ మేకోవర్ కావాలంటే ఏ హీరో అయినా పూరితో సినిమా చేయాల్సిందే. ఎవర్నయినా పూర్తిగా మార్చేసి, తెరపై కొత్తగా చూపించడం పూరి జగన్నాధ్ కు అలవాటు. మొన్నటికి మొన్న కల్యాణ్ రామ్ ను సిక్స్ ప్యాక్ లో చూపించాడు. అది విమర్శలకు తావిచ్చిందనే విషయాన్ని పక్కనపెడితే, ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది.

ప్రస్తుతం పూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ఇటు ప్రేక్షకుల్లో అటు అభిమానుల్లో ఒకటే డౌట్. బాలకృష్ణ ఎలా కనిపించబోతున్నాడా అనేదే ఆ మిలియన్  డాలర్ క్వశ్చన్. పూరి సినిమాల్లో బాలయ్య రొటీన్ గా మాత్రం కనిపించడని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారంతా. ఈ అంచనాల మధ్య బాలయ్య కొత్త గెటప్ తో ఓ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

బాలయ్య 101వ సినిమాకు సంబంధించి త్వరలోనే పోర్చుగల్ లో ఓ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. ఎల్లుండే యూనిట్ అంతా కలిసి పోర్చుగల్ బయల్దేరుతున్నారు. దాదాపు 40రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో బాలయ్య ఈ గెటప్ లోనే కనిపిస్తారట. గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు  సంబంధించి బాలయ్యపై వచ్చే కీలకమైన సన్నివేశాలన్నీ ఈ 40 రోజుల షెడ్యూల్ లో పూర్తిచేస్తారట.

Show comments