సంజన 'నగ్నచిత్రం' కథా కమామిషు

'దండుపాళ్యం-2' సినిమా కోసం సంజన నగ్నంగా నటించిందట అన్న వార్త కలకలం రేపింది. దానిక్కారణం, సోషల్‌ మీడియాలో లీక్‌ అయిన ఆ సినిమాకి సంబంధించిన వీడియో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ వీడియోలో సంజన నగ్నంగానే కన్పించింది. అయితే, ఈ రోజుల్లో నగ్నత్వం వెనుక సినిమాటిక్‌ కథలు చాలానే వుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఒక్కోసారి డూప్‌ని పెట్టి, 'నగ్న' సన్నివేశాల్ని చిత్రీకరిస్తుంటారు. ఇంకొన్నిసార్లు, గ్రాఫిక్స్‌ మాయాజాలం జరుగుతుంటుంది. చాలా అరుదుగా, 'పేరు' కోసం హీరోయిన్లే కాదు, హీరోలు కూడా నగ్నంగా తెరపై కన్పించేస్తుంటారు. హాలీవుడ్‌లో అయితే నగ్నత్వం చాలా చిన్న విషయం. బాలీవుడ్‌లోనూ కొందరు భామలు తెరపై నగ్నంగా కన్పించారు. అయితే, అది నిజంగానే నగ్నత్వమా.? అన్న అనుమానాలైతే మామూలేననుకోండి.. అది వేరే విషయం. 

ఇక, 'దండుపాళ్యం-2' సినిమాలో సంజన నగ్న వీడియో విషయానికొస్తే, ముందేమో అది నిజమేనని ఒప్పుకుంది సంజన. ఆ తర్వాత డూప్‌ని పెట్టి తీశారని చెప్పింది. చివరగా ఇప్పుడు 'గ్రాఫిక్స్‌' అంటోంది. ఏది నిజం.? ఆమెకే తెలియాలి. 'అది గ్రాఫిక్స్‌.. పూర్తిగా బ్లూ మ్యాట్‌ టెక్నాలజీ ఉపయోగించి తీసిన సన్నివేశమది..' అంటూ దానికి సంబంధించిన కొన్ని ఫొటోల్ని కూడా సంజన విడుదల చేసింది. 

సినిమా పబ్లిసిటీ కోసం ఉపయోగపడే ఈ విషయాన్ని సంజన ఎందుకంత సీరియస్‌గా తీసుకుందో ఎవరికీ అర్థం కావడంలేదు. పైగా, సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన తాను, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఏ పనీ చేయనంటూ వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. హాలీవుడ్‌లో 'జేమ్స్‌బాండ్‌' సినిమా కోసం అడిగినా నగ్నంగా నటించబోనని సంజన చాలా ఉద్వేగంగా మాట్లాడేస్తోంది. అన్నట్టు, 'దండుపాళ్యం-2' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే.

Show comments