ఇల్లీ బేబ్‌.. బికినీ బేబ్‌.. ఏందీ గోల.?

అవకాశాల కోసమో, పాపులారిటీ కోసమో.. ఏదైతేనేం, ఇల్లీ బేబ్‌ విచ్చలవిడిగా గ్లామర్‌ని ఆరబోసేస్తోంది. అలా ఇలా కాదు, పొటోలతో వీడియోలతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోంది. అసలే హాట్‌ హాట్‌ ఫిజిక్‌ కావడంతో, బికినీ గ్లామర్‌ ఇలియానా ఇంకా కెవ్వు కేక అన్పించేస్తుండడంతో, అనూహ్యంగా ఆమె పాపులారిటీ పెరిగిపోతోంది. సోషల్‌ మీడియాలో ఇలియానా రానురాను ట్రెండింగ్‌గా మారిపోతోంది తన హాట్‌ షోతో. 

తాజాగా ఇలియానా ఓ వీడియోని షేర్‌ చేసింది. స్విమ్మింగ్‌ పూల్‌లో నీటి అడుగు నుంచి తీసిన వీడియో ఇది. ఇందులో ఇలియానా టూ పీస్‌ బికినీ గ్లామర్‌తో రెచ్చిపోయిందంతే. పూనమ్‌ పాండే తరహాలో ఇల్లీ బేబ్‌ ఈ 'షో' చేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ అవకాశాల కోసం వెంపర్లాడే పరిస్థితుల్లో ఏమీ లేదు ఇలియానా. మొన్నీమధ్యనే అక్షయ్‌కుమార్‌తో ఓ సినిమాలో కన్పించింది. సౌత్‌లో మాత్రం పెద్దగా అవకాశాల్లేవనుకోండి ఇలియానాకి అది వేరే విషయం. 

ఇక, ఈ గ్లామర్‌ షక్ష సంగతేంటి.? అని ఇలియానాని ప్రశ్నిస్తే, 'అందాన్ని ఆస్వాదించండి.. ప్రశ్నిస్తారెందుకు.?' అంటూ తనదైన స్టయిల్లో కౌంటర్‌ ఇచ్చేస్తోంది ఇలియానా. అందం ఆస్వాదించడం సంగతెలా వున్నా, ఈ ఫొటోలు, వీడియోలతోనే టైవ్‌పాస్‌ చేస్తే పూనమ్‌ పాండేకీ, ఇలియానాకి తేడా ఏంటి.? అని సినీ జనం ఫీలయ్యే ప్రమాదం లేకపోలేదండోయ్‌.

Show comments