నాని ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా..?

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని మరో ఇల్లు కొన్నాడు. అది ఇల్లు కాదు, ఏకంగా విల్లా. అవును.. హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో 5 కోట్ల రూపాయల ఖరీదైన విల్లా కొన్నాడు నాని. కొన్ని రోజుల కిందటే ఈ విల్లాకు సంబంధించిన లావాదేవీలన్నీ ముగిసినట్టు తెలుస్తోంది. ఓ మంచి ముహూర్తం చూసి కొత్తింట్లో అడుగు పెట్టడమే ఆలస్యం.

ఈ మధ్యే హీరో రాజ్ తరుణ్, బంజారా హిల్స్ లో 2 కోట్ల ఖరీదైన ఓ ఇంట్లోకి మారాడు. మరో హీరో విజయ్ దేవరకొండ కూడా ఇల్లు తీసుకున్నాడు. దర్శకుడు రాజమౌళి విశాఖలో ఓ పెద్ద స్థలం కొనుగోలు చేసి, బీచ్ గెస్ట్ హౌజ్ కట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి నాని కూడా చేరిపోయాడు. త్వరలోనే తన కుటుంబంతో పాటు కొత్తింటికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు.

కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా నుంచి వరుసగా హిట్స్ కొడుతూనే ఉన్నాడు నాని. ఈ ఇయర్ నేను లోకల్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. వచ్చే నెలలో మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. ఓవైపు వరుసగా విజయాలు, మరోవైపు కొడుకు పుట్టిన ఆనందం, ఇంకోవైపు కొత్త ఇల్లు.. అదిరిందయ్యా నాని.

Show comments