రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో తయారయ్యే సినిమా కథ గురించిన వివరాలు గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ 80-90ల మధ్య నడిచే ప్రేమకథ అని తెలిసిందే. ఈ సినిమా కథ గురించి మరిన్ని అప్ డేట్స్ ఇప్పుడు తెలుసుకోండి.
ఈ పాత ప్రేమ కథ అచ్చమైన గోదావరి జిల్లా పల్లెటూరులో జరుగుతుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన సుకుమార్, అలాంటి పల్లెటూరులోనే షూట్ చేయాలని చూస్తున్నారు. కానీ రామ్ చరణ్ ను తీసుకుని ఈస్ట్ గోదావరి పల్లెటూరికి వెళ్తే షూటింగ్ చేయడం అంత సులువు కాదు. అక్కడ అభిమానులు ఆ రేంజ్ లో వుంటారు. ఇందుకోసం ఏకంగా ఓ అచ్చమైన గోదారి పల్లెటూరు సెట్ ను తోట తరణి ఆర్ట్ డైరక్షన్ లో తయారు చేయించాలని డిసైడ్ అయ్యారు. ఓ మాంచి గోదావరి జిల్లా ఊరు ఎంపిక చేసి, అలాంటి సెట్ ఇక్కడ వేసి, క్లోజ్ లు ఇక్కడా, ఏరియల్ వ్యూలు అక్కడా తీసి, మిక్స్ చేయాలన్నది బేసిక్ అయిడియాగా తెలుస్తోంది.
తొలి హిలేరియస్
సుకుమార్ సినిమాల్లో కామెడీ మరీ ఎక్కువగా వుండదు కానీ, బాగానే వుంటుంది. ఈ సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా స్క్రిప్ట్ తయారు చేసారట. ఒక పక్క పల్లెటూరి ప్రేమలు, బంధాలు, కుటుంబ సంబంధాలు వుంటూ, చిన్న రివెంజ్ డ్రామా కూడా మిక్స్ చేస్తూ ఈ సబ్జెక్ట్ తను సుకుమార్ తయారుచేసారట.
హీరోయిన్
రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా రాశీఖన్నాకు టెస్ట్ షూట్ అయితే చేసారు. కానీ ఫైనల్ చేయలేదు. బెటర్ ఛాయిస్ ఎవరన్నా దొరుకుతారని వెదుకుతున్నారు. మంచి ముహుర్తం కోసం కొద్ది రోజుల్లో పూజ నిర్వహించి, జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తారు. ఆ లోగా హీరోయిన్ ఫైనల్ అయితే చాలు. ప్రస్తుతానికి ఇవీ అప్ డేట్స్.