ముగ్గురు మెగా హీరోలు రుమాళ్లేసారు కానీ..

సినిమా ప్రారంభించినపుడే విడుదుల ఎప్పుడు అన్నది ముందుగా ప్రకటించేయడం ఆనవాయతీగా మారింది ఇటీవల. ముఖ్యంగా పెద్ద సినిమాలకు. దీనివల్ల మిగిలిన వారు, వాళ్ల సినిమాలను ప్లాన్ చేసుకుంటారు. మెగా కాంపౌండ్ కు చెందిన మూడు పెద్ద సినిమాలు ప్రకటించారు. వీటిలో బాస్ చిరంజీవి సినిమా సంక్రాంతికి అని చెప్పేసారు. 

చినబాస్ రామ్ చరణ్ సినిమా అక్టోబర్ అని ప్రకటించేసారు. షూట్ ఇంకా స్టార్ట్ కాకున్నా బన్నీ తన సినిమా సమ్మర్ కు అని వెల్లడించారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన సినిమా ఎప్పడో తెలియచేయలేదు. మెగా హీరోలే కాదు.. బాలయ్య లాంటి పెద్ద హీరో కూడా సంక్రాంతికి వస్తున్నారని కన్ ఫర్మ్ అయిపోయింది. కానీ పవర్ స్టార్ సినిమా ఒక్కటే డేట్ తెలియకుండా వున్నది. ఆ సినిమాకు ఎస్ జె సూర్య డైరక్షన్ అనుకున్నారు.. మారిపోయింది.. డాలీ వచ్చి చేరారు. 

హీరోయిన్ గా శృతిని దాదాపు ఫిక్స్ చేసినట్లే. ఆమె జూలై 16 తరవాత ఫ్రీ అవుతుందని వినికిడి. అంటే జూలై మూడోవారంలో మరి పవర్ స్టార్ సినిమా ప్రారంభం అవుతోందేమో? అలా అయితే కనీసం ఆరునెలలు నిర్మాణం అనుకున్నా,  జనవరి వేళకు ఫినిష్ కావాలి. అలాంటపుడు ఫిబ్రవరి, మార్చి అని నిర్మాత ప్రకటించవచ్చు..కానీ ఎందుకు చేయడం లేదో? 

Show comments