లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ప్రకటించబోతోందట. అదెంత నిజం.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్‌లో ఈ ప్రకటన చేస్తారని నిన్న రాత్రి నుంచీ ప్రచారం జరిగింది. ఆ మధ్యాహ్నం 2 గంటలు కాస్తా, సాయంత్రం 6.30 నిమిషాలకు మారింది. అది 8 గంటలకు చేరింది. 9 గంటలు.. 10 గంటల సమయమొచ్చింది. ప్చ్.. ఏమీ జరగలేదు.
కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సంప్రదింపులు జరుపుతోందనీ, ఈ క్రమంలోనే ప్రకటన ఆలస్యమవుతోందనీ గుసగుసలు విన్పిస్తున్నాయి. 'డ్రాఫ్ట్ వచ్చేసింది.. దాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు..' అనేది మరో గాసిప్. అందులో కొన్ని పదాలపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తే, తిరిగి కేంద్రం ఆ డ్రాఫ్ట్‌ని మార్చి, లావోస్ పర్యటనలో వున్న ప్రధానికి పంపిందన్నది మరో వార్త.
వెరసి, ఈ సందట్లో ప్రత్యేక హోదా అంశం పూర్తిగా అటకెక్కేసింది. అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ, ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. మరికొందరు టీడీపీ నేతలూ ఇదే మాట విన్పించారు. అందరూ అలిసిపోయారు. ప్రస్తుతం ప్యాకేజీ చుట్టూనే టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. అంతా నాటకం.. ఇది కేంద్రంతో కలిసి రాష్ట్రం ఆడుతున్న నాటకం. బీజేపీ - టీడీపీ కలిసి ఆడుతున్న నాటకం.
సిగ్గు సిగ్గు.. ఒక్క ప్రకటన కోసం రెండేళ్ళు నాటకాలాడి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో నాటకమా.?