మోడీ భక్తుల మధుర శృంగారానుభవం!

రాస్తే ఇదొక శృంగార గాథ అవుతుంది. నో పెయిన్.. నో ప్లజర్.. అన్నట్టుగా ఉంది మోడీ అభిమానుల తీరు. ‘మోడీ’ అనే ఆనందాన్ని అనుభవించాలంటే.. ఈ పెయిన్ తట్టుకోవాల్సిందే, పెయిన్ తో ప్లజర్ ఉంటుంది.. అనే తమ ఆనందతత్వాన్ని చెబుతున్నారు. శృంగారానికి సంబంధించి కూడా అచ్చం ఇదే తత్వాన్ని చెబుతారు సెక్సాలజిస్టులు!  

నెల రోజుల వ్యవధిలో మూడోసారి పెంపు.. పెట్రో ధరలపై మోడీ ప్రభుత్వం చేతి వాటం! ఈ మూడు సార్లూ కలుపుకుంటే.. నెల రోజుల్లో లీటర్ పెట్రో ధర  దాదాపు ఐదు రూపాయల వరకూ పెరిగింది! డీజిల్ పై భారం ఇంత కన్నా ఎక్కువ స్థాయిలో పెరిగింది. వీటి ఫలితంగా ప్రతి నిత్యవసర సరుకు ధరా పెరుగుతుంది, చాలా మిడిల్ క్లాస్ కుటుంబాల బడ్జెట్ అతలాకుతలం అవుతుంది. అయితేనేం.. మోడీ గిల్లితే నొప్పితో గాక పరవశంతో తబ్బిబ్బయ్యే భక్తులు చాలా మందే ఉన్నారాయె!

ఈ ఆనందం పట్టలేక.. భావోద్వేగానికి గురై.. కళ్ల నిండా ఆనంద భాష్పాలతో.. మధుర శృంగారానుభవం పొందిన స్త్రీ వలే.. మూలుగుతున్నారు! ఆనందాన్ని తట్టుకోలేక ఆమె వలే కేకలు పెడుతున్నారు.. కమాన్! అంటున్నారు. ఫ.. మీ హార్డ్… అనే మాట కూడా అక్కడక్కడ వినిపిస్తోంది! 

ఇక ఈ శృంగారానుభవం కోసం.. బట్టలిప్పి కూర్చున్న మీడియా అయితే.. ఈ సమయంలో తన విన్యాసాలు చేస్తోంది. పెట్రో ధరలు పెరిగాయనే విషయాన్ని చమురు  సంస్థలకు ఆపాదించేస్తోంది! చమురు సంస్థలు మరోసారి చేతి వాటం ప్రదర్శించాయని చెబుతోంది!

యూపీఏ హయాంలో పెట్రో ధరలు పెరిగితే.. అది ప్రభుత్వ వైఫల్యం. మోడీ హయాంలో పెరిగితే మాత్రం అది చమురు సంస్థల నిర్వాకం! ఇదీ బట్టలిప్పిన మీడియా వర్గాల నిస్సిగ్గు భాష్యం. 

ఈ పెట్రో ధరల పెంపును.. డాలర్ తో రూపాయి మారకం విలువ గురించి లెక్చర్లిచ్చే నిస్సిగ్గు వేశ్యలూ చాలా మందే ఉన్నారు. మరి డాలర్ తో రూపాయి మారకం విలువతో పోల్చుకున్నా ప్రభుత్వం జనాలను దోచుకుంటోందని సోదాహరణంగా వీరికి వివరించినా.. రూపాయి మారకం విలువ పతనం కూడా మోడీ సమర్థతకు ఒక గీటురాయి అంటే.. మాత్రం మళ్లీ ఇంకో వాదనతో వస్తారు. వేశ్యల వలే తయారైంది వీళ్ల పరిస్థితి.

పెంచినందుకు ప్రభుత్వాన్ని కాదు కానీ.. దీన్నంతా సమర్థిస్తూ.. వంకర్లు పోతున్న మీడియాను, మెదడులేని మూఢులను చూస్తేనే ఎక్కువ ‘అసహనం’ కలుగుతుంది.

Show comments