వీళ్ళెప్పుడు ఆ తీపి కబురు చెప్తారో.!

సమంత, నాగచైతన్య.. ప్రేమపక్షులు.. త్వరలో వైవాహిక బంధంతో ఒక్కటవబోతున్నారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. అయితే, అన్నయ్య నాగచైతన్యకన్నా, తమ్ముడు అఖిల్‌ చాలా ఫాస్ట్‌.. అందుకే, ముందుగానే తాను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసేసుకున్నాడు. ఇంతకీ, సమంత - నాగచైతన్య పెళ్ళెప్పుడు.? అంతకన్నా ముందు జరగాల్సిన ఎంగేజ్‌మెంట్‌ ఎప్పుడు.? 

పై ఫొటోలో అక్కినేని నాగార్జున, తన ఇద్దరు కుమారులు, కాబోయే కోడళ్ళతో ఫుల్‌ జోష్‌లో కనిపిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగి వుంటే, సమంత - నాగచైతన్య ఈపాటికే వైవాహిక బంధంతో ఒక్కటయిపోయి వుండేవారు. కెరీర్‌ గురించో, ఇంకేదన్నా కారణంతోనో.. 'త్వరలో..' అంటూ ఇద్దరూ సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు తమ పెళ్ళికి సంబంధించి. పెళ్ళి పక్కా, అదెప్పుడు.? అన్నదే సస్పెన్స్‌. 

అక్కినేని కుటుంబంతో సమంత బాగా కలిసిపోయింది. కొన్ని నెలల క్రితం నాగార్జున, నాగచైతన్య - సమంతతో ప్రత్యేక పూజలు కూడా చేయించారు. అది 'మతం మార్పు' కోసం అంటూ పెద్ద దుమారమే సృష్టిస్తే, దాన్ని నాగచైతన్య ఖండించేశాడనుకోండి.. అది వేరే విషయం. మొత్తమ్మీద, అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ పూర్తవడంతో, ఇప్పుడు పెద్ద కుమారుడు నాగచైతన్య మీద చాలా ఒత్తిడి పెరిగిపోతోంది. 'ఆ ముచ్చట' అదే నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ కోసం అభిమానులూ ఎదురుచూస్తున్నారు. 

నాగచైతన్య పెళ్ళి ముందు అయి వుంటే, కోడలి హోదాలో సమంత, అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌లో సందడి చేసేది. కానీ, సమంత ఇప్పుడు కాబోయే కోడలిగానే ఫొటోల్లో కన్పించాల్సి వస్తోంది.

Show comments