మొండివాడు అనుకోవాలో, తెలివైన మూర్ఖత్వం అనుకోవాలో కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు. తాను చేసిన ట్వీట్ మంచిదా, చెడ్డదా అన్నది పక్కన పెడితే, చేసిన ట్వీట్ కు కట్టుబడడం, అంతేకాదు, కేసులు పెట్టినా భయపడకుండా తిరిగి ఎదురు ట్వీట్ లు చేయడం, దాడి చేస్తామంటే, రెడీ రండి అంటూ అడ్రస్ చెప్పడం, ఇవన్నీ ఆర్జీవీ మొండివాడి కన్నా బలవంతుడు అనిపిస్తున్నాడు.
నిజానికి ఆర్జీవీ మహిళా దినోత్సవంనాడు అలాంటి ట్వీట్ చేయడమే అసంబద్ధం. సన్నీలియోన్ ఏ విధంగా సంతోషం కలిగిస్తుందో? మహిళలంతా మగవారికి అలాంటి సంతోషాన్ని ఇవ్వాలన్నది రామ్ గోపాల్ వర్మ ట్వీట్. దీనిపై ఆందోళన మొదలైంది. కేసులు దాఖలయ్యాయి. ఆఖరికి ముంబాయిలో ఆర్జీవీని చెప్పులతో కొడతామంటూ హెచ్చరికలు వినిపించాయి.
అయినా ఆర్జీవీ చెక్కు చెదరడంలేదు. ఇదంతా హిపోక్రసీ అంటున్నాడు. మహిళలందరికన్నా ఆత్మగౌరవం కలది సన్నీలియోన్ అంటున్నాడు. అసలు ఇలా ఎలా అంటాడు? ఎవరి ఆత్మ గౌరవం వారిది. దానికి కొలామానాలేమిటి? అదేమని నిలదీస్తే వాక్ స్వాంతంత్ర్యం, డెమాక్రసీ లాంటి పెద్ద పదాలు వాడుతున్నాడు.
నిజానికి రాను రాను ఆర్జీవీ ట్వీట్ లు హద్దులు దాటుతున్నాయన్నది వాస్తవం. ఇదోరకం పబ్లిసిటీ. వాడో పిచ్చోడు, వదిలేయడమే అనే కామెంట్లు చేయడం సులువే. కానీ అలా అని వదిలేస్తుంటే, ఎక్కడికో వెళ్తున్నాడు ఆర్జీవీ.
ఇవన్నీ చాలవన్నట్లు తాను సన్నీలియోన్ మీద చేసిన రెండు ట్వీట్ లు అర్థం కాకుంటే డిక్షనరీ చూడండి, అంటూ ఎత్తి పొడుస్తున్నాడు. ఏది ఏమైనా ఇది తెగువ అనుకోవాలో? మూర్ఖత్వం, లేదా మొండితనం అనుకోవాలో.