పవన్ కు ధీమా వచ్చేసిందా?

పవన్ తో సినిమా అంటే అది ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదన్నది ఇండస్ట్రీ నానుడిగా మారిపోయింది. అలాంటిది హారిక హాసిని సినిమా, పైగా త్రివిక్రమ్ దర్శకుడు అనగానే సినిమా చకచకా సాగిపోతుందని అనుకున్నారు చాలా మంది. నిజానికి ఈ సినిమాకు డేట్లు ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా అని 2016 మధ్య నుంచి ఊరించుకుంటూ వచ్చారు పవన్ బాబు. సరే ఆఖరికి ప్రారంభమైంది దసరాకు విడుదల అనుకున్నారు. కాదు దీపావళి అనుకున్నారు. 

అయితే పెట్టిన పెట్టుబడికి సరైన సీజన్ అవసరం అని అనుకోవడంతో సంక్రాంతికి అని ఫిక్సయ్యారు. అయితే దసరా దీపావళి అనుకున్నపుడే వారం నుంచి పది రోజులు వెనకబడింది షూటంగ్ అని వినికిడి. ఇప్పుడు తాపీగా సంక్రాంతికి వద్దాం అనుకునసరికి బండి మరీ స్లో అయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా షూట్ బాగానే అవుతున్నట్లు కనిపిస్తోంది కానీ, బకాయిలు మాత్రం బాగానే వున్నాయట. అయితే దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి, ఇంకా ఎంత పని వుంది? ఎంత పూర్తయింది అన్న లెక్కలు తీయడం లేదు. ఎలా కాదన్నా ఇంకా నాలుగున్నర నెలలు టైమ్ వుంది. అందువల్ల తాపీగా చేసుకుందాం. వచ్చిన నష్టమేముంది అనుకుంటున్నారు. దానికి తగ్గట్లే హీరో పవన్ బాబు అడుగులు వేస్తున్నారట.

Show comments