ఆ ముద్దులు వృధా అయిపోలేదట.!

'బేఫికర్‌' సినిమాకి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.. ఆ మాటకొస్తే, సినిమాకి జరిగిన పబ్లిసిటీ, క్రియేట్‌ అయిన హైప్‌తో పోల్చితే, సినిమా విడుదలయ్యాక లభిస్తున్న రెస్పాన్స్‌ చాలా 'వీక్‌' అని చెప్పక తప్పదు. అయినాసరే, వసూళ్ళు అదిరిపోయాయంటోంది 'బేఫికర్‌' సినిమా కోసం చాలా కష్టపడి, చాలా చాలా 'ఓపెన్‌'గా నటించేసిన సెక్సీ భామ వాణి కపూర్‌. 

'అవును నేను సెక్సీ.. అందుకు నేను చాలా గర్వపడ్తాను.. ఎవరైనాసరే నన్ను ఓయ్‌ సెక్సీ.. అని పిలిస్తే, ఎంజాయ్‌ చేస్తాను.. అదేమంత తేలిగ్గా వచ్చే గుర్తింపు కాదు..' అని చెప్పే వాణి కపూర్‌, 'బేఫికర్‌' సినిమా తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని అంటోంది. సినిమాలో లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్స్‌లో నటించాల్సి వచ్చినప్పుడు తనకేమీ ఇబ్బందిగా అన్పించలేదనీ, ఎందుకంటే అది నటన అని తనకు తెలుసు అనీ చెప్పుకొచ్చింది వాణి కపూర్‌. 

సినిమా విడుదలయ్యేదాకా, 'ఆ ముద్దులు వృధా అయిపోతాయేమో..' అన్న భయం వుండేదనీ, సెన్సార్‌ గండం గట్టెక్కడమే కాకుండా, యూత్‌ ఆడియన్స్‌ నుంచి సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్‌ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నానని వాణికపూర్‌ చెబుతోంది. వాణి ఎంతైనా చెప్పొచ్చుగాక, సినిమాలో మాత్రం అంత సీన్‌ లేదని జనం తేల్చేశారు. ఆ 'మూతి ముద్దుల కహానీ ఏంటి.?' అన్న స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ వున్న యూత్‌ ఆడియన్స్‌ మాత్రం సినిమాకి బాగానే కనెక్ట్‌ అవుతున్నారన్నది బాలీవుడ్‌ సినీ జనం వాదన.

Show comments