పవన్ కళ్యాణ్ కు తనను అభిమానించే వాళ్లంటే మహా ఇష్టం. వారి కోసం ఆయన కదలి వస్తారు. ప్రమోట్ చేస్తారు. ఆలీ, నితిన్, ఇప్పుడు సప్తగిరి. నవంబర్ 6న కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ అడియో ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. సప్తగిరి అభిమానంతో అడగడంతో వస్తానని మాటిచ్చిన పవన్, ఇప్పుడు స్వయంగా డేట్ కూడా ఓకె చేసాడట.
నవంబర్ ఆరున ఫంక్షన్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సప్తగిరి ఎక్స్ ప్రెస్ యూనిట్ తెలిపింది. పవన్ అడియో ఫంక్షన్ కు రావడం అంటే సినిమాకు మాంచి బజ్ వచ్చినట్లే. సుమారు ఆరేడు కోట్లతో డాక్టర్ రవికిరణ్ నిర్మించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ వచ్చేనెలాఖరులో ప్రేక్షకుల మందుకు వస్తుంది.