నాగచైతన్య కాన్ఫిడెన్స్‌ ఓ రేంజ్‌లో వుంది.!

దసరా పండక్కి వస్తోన్న 'ప్రేమమ్‌' సినిమాపై అక్కినేని నాగచైతన్య కాన్ఫిడెన్స్‌ ఓ రేంజ్‌లో వుంది. అందుకేనేమో, ముందుగా రావాల్సిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాని పక్కన పెట్టి మరీ, నాగచైతన్య 'ప్రేమమ్‌' సినిమాని ముందుకు తీసుకొచ్చాడు. నిజానికి 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమానే ముందుగా రిలీజ్‌ అవ్వాల్సి వుంది. కారణాలేవైతేనేం, 'ప్రేమమ్‌' సినిమాతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నాగచైతన్య. 

'ప్రేమమ్‌' మూడు ప్రేమకథల సమాహారం. మూడు ప్రేమకథల్లోనూ హీరో ఒకడే. హీరోయిన్లు మాత్రం ముగ్గురు. ఒక్కో వయసులో ఒక్కో అమ్మాయితో ప్రేమ.. ఇదీ సింపుల్‌గా 'ప్రేమమ్‌' గురించి చెప్పాలంటే. సరదా సరదా ప్రేమ, ఓ మోస్తరు మెచ్యూరిటీతో ప్రేమ, పూర్తిస్థాయి మెచ్యూరిటీతో ప్రేమ.. ఇలా ప్రేమించే వయసులోని భిన్నమైన కోణాలు హీరో పాత్రలో కన్పిస్తాయట. 

మలయాళంలో 'ప్రేమమ్‌' ఘనవిజయం సాధించడంతో, తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నాగచైతన్య ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. స్లోగా స్టార్ట్‌ చేసి, ప్రమోషన్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళిపోయారు. ఒరిజనల్‌తో పోల్చితే, తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులే చేశారట.. అదీ నేటివిటీ కోసం. 

మొత్తమ్మీద, 'ప్రేమమ్‌' సినిమాపైనా, దసరా సెలవులపైనా నాగచైతన్య ఓ రేంజ్‌లో ఆశలు పెట్టేసుకున్నాడు. ఆశలు పెట్టేసుకోవడమే కాదు, ఓ రేంజ్‌ కాన్ఫిడెన్స్‌ కూడా ప్రదర్శిస్తున్నాడు. చూద్దాం, నాగచైతన్య చెబుతున్నట్లుగా 'ప్రేమమ్‌' అతనికి కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ అందిస్తుందో లేదో.!

Show comments