అబ్బే..అంతా ఉత్తుత్తిదే?

త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కథ చెప్పేసాడా? కాంబినేషన్ సెట్ అయిపోయిందా? ఈ మేరకు వినిపిస్తున్న గ్యాసిప్పు లన్నీ ఉట్టివే అని రూఢిగా తెలుస్తోంది. ప్రస్తుతానికి త్రివిక్రమ్ ను ఎవరు పలకరించిన అవును అనడం లేదు కాదు అనడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా తరువాతే ఏదయినా అని మాత్రం అంటున్నారు. 

ఇది కాక, త్రివిక్రమ్ కు కొన్ని పద్దతులు, సెంటిమెంట్లు వున్నాయి. ఆయన వృత్తి వేరు..ప్రవృత్తి వేరు. అక్టోబర్ ఒకటి వరకు ఆయన కొత్తగా ఏ సినిమా కమిట్ కాను అని చెప్పేసారని తెలుస్తోంది. పవన్ సినిమా కాకుండా మరే సినిమా కమిట్ కావాలన్నా కూడా అక్టోబర్ ఒకటి తరువాతనే అని ఆయన గట్టిగా తీర్మానించుకుని వున్నారు. దీనికి ఆయనకు వుండే సెంటిమెంట్లు ఆయనకు వున్నాయి. అయితే హారిక హాసిని బ్యానరే త్రివిక్రమ్ తో ముడిపడి వుంది. 

అందువల్ల ఆ బంధంతో లెక్కలు వేసుకున్న తరువాతే ఆయన ఎవరికైనా సినిమా ఓకె అనేది. అయితే మహేష్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తమ బ్యానర్ లో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఎన్టీఆర్ తో చేయించాలని మరి కొందరి ప్రయత్నం. కానీ అసలు కమిట్ కావడం అన్నదే ఇంకా లేదు. ఆ తరువాత కథ, ఫ్యామిలీ ఎమోషన్ అన్న మిగిలిన వ్యవహారాలు. 

Readmore!
Show comments

Related Stories :