డబ్బింగ్ మొదలెట్టిన శాతకర్ణి

బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. వెల్ ప్లాన్డ్ గా నిర్మాణమవుతున్న ఈ సినిమా షూటింగ్ డైరక్టర్ క్రిష్ పెళ్లి కారణంగా కాస్త బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఆపలేదు. ముఖ్యంగా కీలకమైన గ్రాఫిక్స్ పనులు చకచకా సాగుతున్నాయి. 

ఇదిలా వుంటే, మంచి రోజు చూసుకుని, హీరో బాలకృష్ణ ఆదివారం నాడు డబ్బింగ్ మొదలు పెట్టేసారు. ఇప్పటి దాకా పూర్తయిన టాకీకి సంబంధించి ఈ రోజు  డబ్బింగ్ చెప్పడం బాలకృష్ణ మొదలు పెట్టారు. ముహుర్తాలు మంచి రోజులు లాంటి నమ్మకం వుండడంతో బాలయ్య ఈ రోజు డబ్బింగ్ కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. 

డైరక్టర్ క్రిష్ హానీమూన్ ముగియగానే మళ్లీ తరువాతి షెడ్యూలు ప్రారంభమవుతుంది. ఓ విదేశీ షెడ్యూలు, మరో స్వదేశీ షెడ్యూలుతో శాతకర్ణి టాకీ పూర్తయిపోతుందని తెలుస్తోంది. పోస్ట్ ఫ్రొడక్షన్ కు మాత్రం కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, రీ రికార్డింగ్ చాలా కీలకం. ఈ సినిమా సంక్రాంతికి జనాల ముందుకు వస్తుందన్న సంగతి తెలిసిందే.

Show comments