పవన్ పై తమ్మారెడ్డి కామెంట్స్

అభిమానులు తన వెనుక వున్నారు..తను ఏం మాట్లాడినా అదే అద్భుతం అనుకుంటారు. ఇక కులాభిమానం వున్నవారి సంగతి చెప్పనక్కరలేదు అని అనుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చిత్తానికి మాట్లాడేస్తున్నారు. ఎవరు అదేంటని ప్రశ్నించినా, రాసినా, అభిమానులు వెర్రి అభిమానంతో విరుచుకుపడుతున్నారు. కానీ ఎదురు దాడి చేసేవాళ్లు చేస్తూనే వున్నారు.

ఇప్పుడు సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ రేంజ్ లో వాయించేసారు పవన్ ను. ప్రత్యేక హోదా గురించి ఇంకా క్లారిటీ క్లారిటీ అంటాడేంటీ పవన్..ఇవ్వం అని వాళ్లు అంత క్లారిటీగా చెప్పేసాక అని నిలదీసారు. పవన్ ఇంటికి వచ్చి చెప్పాలా వాళ్లు హోదా ఇవ్వం అని చురకేసారు. ప్రత్యేక హోదా రావాలంటే.. ఫిరంగులకు గుండెను అడ్డంపెట్టే వాళ్లు కావాలని పవన్ అంటున్నారని, అలాంటి వాళ్లే విశాఖలో జనవరి 26న పోరాడారని తమ్మారెడ్డి అన్నారు. కానీ పవన్ మాత్రం రాకుండా ఇంట్లో కూర్చున్నారన్నారు.  నిజంగా పవన్ జనహితం కోసమే రాజకీయాల్లోకి వచ్చేటట్లు అయితే, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే.. పవన్ నిజంగా బయటకొచ్చి పోరాడాలని తమ్మారెడ్డి అన్నారు. 

కానీ పవన్ అంత పని ఇప్పట్లో తలకెత్తుకోరని, 2019 లో మళ్లీ మరోసారి బాబుకు మద్దతుగా నిలిచి, కొన్ని సీట్లు తీసుకుని, జగన్ ను ఓడించడానికే ఆయన కిందా మీదా అవుతారని తమ్మారెడ్డికి మాత్రం తెలియదా? మొన్నటి మాటలే అందుకు ఉదాహరణ..వారసత్వానికి ఓకె (అంటే పవన్ దృష్టిలో లోకేష్ బాబు) కానీ అలా అని అది అడ్డం పెట్టుకుని దోపిడీ అంటే అడ్డం పడతా (పవన్ దృష్టిలో జగన్). అధికారం అక్కరలేదు (అది చంద్రబాబుకే వదిలేస్తా). కొన్ని సీట్లలో మాత్రం పోటీ చేస్తా (పార్టీ గుర్తింపు వుండాలి కదా). అదీ సంగతి.

Show comments