సోనాల్‌ చౌహాన్‌ అందమైన 'కోత'.!

తమ గ్లామర్‌తో కుర్రాళ్ళ గుండెల్ని స్వీట్‌గా కోసేసే అందాల భామలు, తమ అందాన్ని పెంచుకునే క్రమంలో తామూ 'కోత'కి గురవుతూనే వుంటారు. అలనాటి అందాల తార శ్రీదేవి సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. శ్రీదేవి ముక్కుకి చాలాకాలం క్రితం సర్జరీ జరిగింది. అలా శ్రీదేవి తన ముక్కుకి సర్జరీ చేసుకున్నాక మరింత స్టార్‌డమ్‌ సంపాదించుకుంది కూడా. 

ఇక, బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా పలుమార్లు లిప్‌ సర్జరీ చేయించుకుంది. తాజాగా, తన ముక్కుకి, పెదాలకీ శృతిహాసన్‌ సర్జరీ చేయించుకుందన్న గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ సర్జరీల లిస్ట్‌లోకి సోనాల్‌ చౌహన్‌ కూడా చేరిపోయింది. కెరీర్‌ మొదట్లో ఎలా వుంది.? ఇప్పుడెలా వుందంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి సోనాల్‌ చౌహన్‌కి సంబంధించి. వాటిల్లో ఆమె లిప్స్‌ షేప్‌ స్పష్టంగా మారినట్లు తెలిసిపోతోంది. 

సోనాల్‌ చౌహన్‌ మాత్రం, అదంతా మేకప్‌ ఆర్టిస్ట్‌ ప్రతిభేనని చెబుతోందండోయ్‌. 'వయసు తెచ్చిన మార్పులు కొన్ని వుంటాయి.. ఆ క్రమంలోనే అందం మరింత పెరిగి వుండొచ్చు.. అంతేగానీ, అదేదో సర్జరీ చేసుకుంటే జరిగింది కాదు..' అంటూ సోనాల్‌ చౌహన్‌, లిప్‌ సర్జరీ గాసిప్స్‌పై స్పందించింది. కానీ, లిప్‌ షేప్‌లో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది గనుక, సోనాల్‌ చౌహన్‌ కూడా అందమైన 'కోత'కి గురయ్యే వుంటుందని ఖచ్చితంగా చెప్పేయొచ్చు.

Readmore!
Show comments