వినేవాడు ఉంటే ఎన్నయినా చెబుతాడు!

వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నయినా చెబుతాడు. కొంచెం పద్ధతిగా చెప్పుకున్నాం కాబట్టి ఈ సామెత వినడానికి బాగుంది. కానీ ఇదే సామెతకు ఈమధ్య చాలా రీమిక్స్ లు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకొచ్చిన రీమేక్ సామెతను యాజ్ ఇటీజ్ గా కార్తికీ వాడేయొచ్చు. నిజమే.. వినేవాడు ఉండాలే కానీ, కార్తి ఎన్నయినా చెబుతాడు.. 

ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ చెలియా. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోను హైదరాబాద్ లో లాంచ్ చేశారు. ఇక ఫంక్షన్ అంటే ఆర్భాటం ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఒకర్నొకరు ఓ రేంజ్ లో మునగ చెట్టు ఎక్కించేసుకోవడమే పని. సేమ్ టు సేమ్ తతంగం చెలియా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో కూడా జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. హీరో కార్తిని ఎవరూ మునగచెట్టు ఎక్కించలేదు. ఎందుకంటే, అతడే తనకు తానుగా చెట్టు ఎక్కేశాడు. తనను తాను ఎవరెస్ట్ శిఖరంపై నిలబెట్టేసుకున్నాడు.

ఇంతకీ మేటర్ ఏంటంటే... చెలియా సినిమాలో ఫైటర్ పైలట్ గా నటించాడు కార్తి. అంటే యుద్ధ విమానాలు నడిపే సైనికుడు అన్నమాట.  మనం సినిమా చేస్తున్నామని భారత ప్రభుత్వం వచ్చి మనకు యుద్ధవిమానాలు ఇవ్వదు కదా. సాధారణంగా ఈ సీన్లు అన్నీ గ్రాఫిక్స్ లోనే తీస్తారు. లేదంటే సెట్ వేస్తారు. చెలియా సినిమాకు కూడా అదే పనిచేశారు. కానీ దీనికి కార్తి ఇచ్చిన కలరింగ్ మాత్రం మామూలుగా లేదు. ఈ క్యారెక్టర్ కోసం కార్తి ఏకంగా ఫైటర్ పైలట్ ట్రయినింగ్ తీసుకున్నాడట. యుద్ధ విమానాలు నడిపేవారు ఎంత బాధ అనుభవిస్తారో అదంతా అనుభవించాడట. గ్రాఫిక్స్ తో మేనేజ్ చేసేదానికి ట్రయినింగ్ ఎందుకనే డౌట్ మీకొస్తే అది మీ తప్పుకాదు. ఎందుకంటే... వింటున్నది మనం.. చెప్పేది కార్తి. ముందే చెప్పుకున్నాం కదా ఓ సామెత.

Show comments