మళ్లీ సోలో కాంబినేషన్

సోలో సినిమా హీరో నారా రోహిత్ కెరీర్ లో ఓ మంచి సినిమా. ఆ సినిమా తరువాత రోహిత్ కెరీర్ ఊపందుకుంది కానీ, మంచి విజయాలు అయితే రాలేదు. ఆ సినిమా డైరక్టర్ పరుశురామ్ తరువాత రవితేజ తో సారొచ్చారు తీసాడు. కానీ మిస్ కాస్టింగ్ తో టార్గెట్ మిస్ అయింది. ఆ తరువాత అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు చేసాడు. ఇప్పుడు అది విడుదలకు సిద్ధమైంది. 

ఈ సినిమా కాన్సెప్ట్, ట్రీట్ మెంట్ మళ్లీ సోలో స్టయిల్ లో వుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. నారా రోహిత్ కూడా ఈ విషయం తెలుసుకుని, పరుశురామ్ తో ఓ సినిమా చేద్దామని చెప్పేసాడట. ప్రస్తుతం నారా రోహిత్ ఫిజికల్ గా తగ్గే పనిలోవున్నాడు. ఇప్పటికే చాలా వరకు బరువు తగ్గడమే కాదు, ఫేస్ లో కూడా ఛేంజ్ వచ్చింది. 

సో, నారా రోహిత్ లో ఓ మాంచి లవ్ స్టోరీని పరుశురామ్ ప్లాన్ చేస్తున్నారట. అల్లు శిరీష్ శ్రీరస్తు-శుభమస్తు మంచి డేట్ కోసం చూస్తోంది. ట్రయిలర్ ప్రామిసింగ్ వుంది. అందువల్ల ఇది ఏ మాత్రం బాగున్నా పరుశురామ్ వెంటనే నారా రోహిత్ తో సినిమా ప్రారంభించేస్తాడు.

Show comments