ప్రియుడి పుట్టిన రోజును దగ్గరుండి జరిపించింది

హీరోయిన్ అంజలి, హీరో జై మధ్య కుచ్ కుచ్ హోతాపై అనేది మొన్నటిమాట. ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఓపెన్ సీక్రెట్. ఇద్దరూ కలిసే ఉంటున్నారు, కలిసే తిరుగుతున్నారు. తమ మధ్య దాచడానికేం లేదంటున్నారు. అయితే పెళ్లి ఎప్పుడని అడిగితే మాత్రం "జస్ట్ ఎ మినిట్" అంటూ జారుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగా జై పుట్టినరోజు రానే వచ్చింది. మరి ప్రియుడి పుట్టినరోజున "సీతమ్మ" హడావుడి ఎలా ఉందో తెలుసా..

రోజంతా జై పుట్టినరోజు వేడుకల్లోనే గడిపేసింది అంజలి. ప్రస్తుతం బెలూన్ అనే సినిమా చేస్తున్నాడు జై. ఆ సినిమా షూటింగ్ లో ఉన్న టైమ్ లోనే సర్ ప్రైజ్ సెలబ్రేషన్ ప్లాన్ చేసింది అంజలి. యూనిట్ అందరి మధ్య జై కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి కేక్ తినిపించింది. తామిద్దరం భార్యాభర్తలమే అనే రేంజ్ లో ఇద్దరూ బిహేవ్ చేశారట. 

వచ్చే ఏడాది అంజలి-జై పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ల పెళ్లికి అంజలి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. జై మాత్రం పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Show comments