మగధీర ఘోరానే ఈ ముసలాడు...!

తెలుగులో చరిత్ర సృష్టించిన మగధీర సినిమా హిందీలో కూడా రీమేక్ అయి వస్తుందని చాలా ఏళ్లుగా ఎదురుచూశాం. ఇందులో భాగంగా హృతిక్ రోషన్ నుంచి షాహిద్ కపూర్ వరకు ఎన్నోపేర్లు తెరపైకి రావడం కూడా చూశాం. కానీ ఇకపై ఈ రీమేక్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మగధీర కథను యాజ్ ఇటీజ్ ఎత్తేసి ఓ కొత్త సినిమా తీశారక్కడ. అదే రాబ్తా మూవీ.

 సుశాంత్ సింగ్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా రాబ్తా సినిమా తెరకెక్కింది. గత జన్మలో ప్రేమను సక్సెస్ చేసుకోలేక చనిపోయిన ఓ జంట ఈ జన్మలో తమ ప్రేమను ఎలా దక్కించుకుందనేదే ఈ సినిమా కథ. మగధీరలో రామ్ చరణ్ గుర్రంపై ఎక్కి జలపాతం నుంచి ఎలా వస్తాడో, ఇందులో కూడా సుశాంత్ ఎంట్రీ అలానే పెట్టారు. కాకపోతే మగధీర రాజుల కాలం నాటి సినిమా కాబట్టి చెర్రీకి గుర్రం ఉంటుంది. రాబ్తాలో ఈ ప్లాట్ ను కొద్దిగా మార్చారు.

 ఇక మగధీరలో ఉన్న అఘోరా పాత్ర కూడా రాబ్తాలో ఉంది. ఈ సినిమాలో 324 ఏళ్ల వయసు కలిగిన పాత్ర ఒకటి ఉంది. రాజ్ కుమార్ రావు ఈ క్యారెక్టర్ పోషించాడు. తాజాగా ఆ లుక్ కూడా విడుదల చేశారు. విలన్ తో పాటు హీరోహీరోయిన్లకు వాళ్ల గత జన్మల గురించి చెప్పేది ఇతడే అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సో.. మగధీర సినిమాకు హైటెక్ కలరింగ్ ఇచ్చి రాబ్తా మూవీగా బాలీవుడ్ లో ప్రజెంట్ చేస్తున్నారన్నమాట. కాకపోతే మగధీరలో ఉన్న "టచ్ ఎఫెక్ట్" ఇందులో తీసేశారు. హీరోయిన్ ను టచ్ చేయగానే హీరో ఒంట్లో వేయి ఓల్టుల విద్యుత్ ప్రవహిస్తుంది. రాబ్తాలో మాత్రం అలా ఉండదు. ఇది బాలీవుడ్ సినిమా. ఎంచక్కా హీరోహీరోయిన్లు లిప్ కిస్సులు పెట్టుకుంటారన్నమాట.

Readmore!

Show comments