నానిని కమల్‌తో పోల్చేయొచ్చా.?

నో డౌట్‌.. తెలుగు సినీ పరిశ్రమలో నటన పరంగా నానికి మైనస్‌ మార్కులేసేవారు ఎవరూ కనిపించరేమో. చిన్న సినిమాలకు చాలా పెద్ద హీరో నాని. ఇమేజ్‌ అనే చట్రంలో ఇప్పటిదాకా ఇరుక్కోని యంగ్‌ హీరో కూడా నాని మాత్రమే అనడం నిస్సందేహం. నాని సినిమాపై భారీ అంచనాలుండవు.. కానీ, నాని సినిమాల నుంచి ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశిస్తారు. ఈ కోణంలో నాని, తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నాడన్నది నిర్వివాదాంశం. 

అయితే, అంత మాత్రాన నానిని కమల్‌హాసన్‌తో పోల్చేయగలమా.? బహుశా కమల్‌హాసన్‌ చేసినన్ని ప్రయోగాలు ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఇంకే నటుడూ చేయలేదేమో. ఇప్పటికీ కమల్‌హాసన్‌ ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కోలేదు. వంద కోట్ల బడ్జెట్‌తో సినిమా చేసినా సరే, కమల్‌ నుంచి కమర్షియల్‌ హిట్‌ కాకుండా అతని సినిమా నుంచి ఏదో వెరైటీని సినీ ప్రేక్షకులు ఆశిస్తారు. దటీజ్‌ కమల్‌హాసన్‌. 

ఏమో, నాని కూడా కమల్‌హాసన్‌లా కమర్షియల్‌ జోన్‌లో ఇరుక్కుపోకుండా, ప్రయోగాత్మక చిత్రాలే చేసుకుంటూ వెళతాడేమో. కానీ, ఇప్పటి పరిస్థితులు వేరు. కమర్షియల్‌ సక్సెస్‌ రాకపోతే, ఎంతటి ప్రయోగాత్మక చిత్రాన్నైనా పక్కన పడేసే ట్రెండ్‌ సినీ పరిశ్రమలో నడుస్తోంది. ఇప్పటికైతే కమల్‌తో నానిని పోల్చడం ఏమాత్రం సబబు కాదు. కో-స్టార్‌ని మోసేయాలన్న తపనతో 'జెంటిల్‌మెన్‌' ఫేం నివేదా థామస్‌ అత్యుత్సాహం చూపిందేమో.! 

అన్నట్టు, 'జెంటిల్‌మెన్‌' సినిమాలో వున్న ఇద్దరు హీరోయిన్లలో నివేదా థామస్‌కే నటిగా ఎక్కువ మార్కులు పడ్డాయి. గ్లామర్‌ జోలికి వెళ్ళబోననీ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తానంటోందీ బ్యూటీ. Readmore!

Show comments

Related Stories :