కొత్త నోటు బ్లాక్ టు వైటూ.!

పెద్ద పాత నోట్ల రద్దు.. పెద్ద కొత్త నోట్ల రాక వెనుక ముఖ్య ఉద్దేశ్యమేంటి.? నల్లధనాన్ని అరికట్టడం. కానీ, నల్లధనానికి ఇప్పుడీ సరికొత్త పెద్ద నోటు కొత్తబలాన్నిస్తోంది. నిజం నిష్టూరమే ఎప్పుడూ. కానీ, అది నిజం.. నిప్పులాంటిది. 

నిజానికి, పెద్ద నోట్లతోనే ఎక్కువ బ్లాక్‌ మనీ పెరుగుతోందన్నది అందరూ చెప్పే మాట. మరి, కేంద్రం పెద్ద పాత నోట్లను రద్దు చేసి, ఇంకా పెద్ద నోటును ఎందుకు తెచ్చినట్లు.? అసలు విషయమేంటంటే, నల్లధనాన్ని పెంచడానికే తప్ప, తుంచడానికి కానే కాదు ఈ ప్రక్రియ అంతా.! అవును, ఇది పచ్చి నిజం. 

2 వేల రూపాయల నోటు మార్కెట్‌లోకి వచ్చింది. దాన్నేం చేసుకోవాలో సామాన్యుడికి అర్థం కావడంలేదు. మార్కెట్‌లో సరిపడా చిల్లర లేనప్పుడు, 2 వేల రూపాయల నోటుతో ఏం చేసుకోవాలట.? బయట ఎక్కడికి వెళ్ళినా 2 వేల నోటుకు చిల్లర దొరకని పరిస్థితి. సాధారణంగా 500 రూపాయల నోటుకి చిల్లర అడిగితేనే, ఎవరూ ఇవ్వరాయె. అలాంటిది, 2 వేల రూపాయల నోటుకు చిల్లర దొరుకుతుందా.? ఛాన్సే లేదు. 

కానీ, 2 వేల రూపాయల నోట్లు మాత్రం ఏటీఎంల నుంచి వచ్చేస్తున్నాయి. కొత్తగా ఏటీఎంలను రీ-కాలిబ్రేట్‌ చేసిన తర్వాత 2 వేల రూపాయల నోటు మరింత విరివిగా మార్కెట్‌లోకి రావడం మొదలైంది. అంతకుముందు వరకూ, అంటే పెద్దనోట్ల రద్దు తర్వాత చాలా పరిమితంగానే పెద్ద నోట్లు బయటకొచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా 2 వేల రూపాయల నోటే కన్పిస్తోంది. 

ఇక్కడే, నల్ల కథ మొదలవుతోంది. 2 వేల రూపాయల నోటు మళ్ళీ మీరిపోతుందట.. అన్న పుకార్ల నేపథ్యంలో, ఇలా తీసుకుంటున్న నోటు, అలా మార్కెట్‌లో మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా ఆ పెద్ద 2 వేల రూపాయల నోటుని, పాత నోట్లతో మార్చుతున్నారు.. తిరిగి, ఆ పాత నోట్లని చిల్లరగా (అంటే వంద రూపాయల నోట్లతో) మార్చుతున్నారు కొందరు అక్రమార్కులు. కిరాణా దుకాణాలు, ఇతరత్రా చిన్న చిన్న వ్యాపారులు ఈ మొత్తం వ్యవహారానికి తెలిసో తెలియక మధ్యవర్తులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. 

చివరికి చేరాల్సిన చోటకి పెద్ద నోట్లు చేరిపోతున్నాయి. అంటే, నల్లకుబేరుల దగ్గర మిగిలిపోయిన పాత పెద్ద నోట్లు.. కొత్త నోట్లుగా మారిపోతున్నాయన్నమాట. 500 రూపాయల నోట్ల కట్టలు నాలుగు దాచుకునే బదులు, ఆ మొత్తం కేవలం ఒక్క 2 వేల రూపాయల నోట్ల కట్టతో దాచేసుకోవచ్చు కదా.! 

సో, ఇప్పుడు చెప్పండి.. 2 వేల నోటు మార్కెట్‌లోకి ఎందుకొచ్చింది.? నల్లధనాన్ని తగ్గించడానికా.? పెంచడానికా.? టెర్రరిస్టుల చేతుల్లోకీ 2 వేల నోట్లు వెళ్ళడం, మార్కెట్‌లోకి యధేచ్ఛగా నకిలీ 2 వేల నోట్లు వచ్చేస్తుండడం.. ఇవన్నీ చూశాక కూడా, నరేంద్రమోడీ పెద్ద నోట్ల నిర్ణయం సూపర్‌ హిట్‌ అందామా.? సూపర్‌ ఫ్లాప్‌ అందామా.?

Show comments