'మగధీర' సినిమాని కాపీ కొట్టేశారా.?

రాజమౌళి దర్శకత్వంలో చరణ్‌ హీరోగా వచ్చిన 'మగధీర' ఆల్‌ టైమ్‌ క్లాసిక్‌ మూవీ. దాన్ని యధాతథంగా కాదుగానీ, కొంతవరకు కాపీ కొట్టేసినట్టుంది బాలీవుడ్‌ సినిమా 'రబ్‌తా' కోసం. సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, కృతి జనన్‌ (1 నేనొక్కడినే ఫేం) జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ చూస్తోంటే, 'మగధీర' షేడ్స్‌ చాలానే గుర్తుకొస్తున్నాయి. 

హీరో సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, నీటి ధార లోంచి దూసుకొస్తున్న సన్నివేశమైతే, 'మగధీర' సినిమాకి కంప్లీట్‌ జిరాక్స్‌ అనుకోవాలి. చిన్న తేడా ఏంటంటే, అందులో గుర్రంతో చరణ్‌ దూసుకొస్తే, ఇక్కడ గుర్రం లేకుండా సుషాంత్‌ దూసుకొచ్చాడంతే. ఇక, బాలీవుడ్‌ సినిమాల్లో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ హద్దులు దాటేయడం గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? షరామామూలుగానే ఈ సినిమాలోని హీరోయిన్లూ లిప్‌ టు లిప్‌ కిస్‌లతో అదరగొట్టేశారు. 

బోనస్‌గా అండర్‌ వాటర్‌ రొమాన్స్‌, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఈ సినిమాకి హైలైట్‌ అయ్యేలా వున్నాయి. పునర్జన్మల కాన్సెప్ట్‌తో 'రబ్‌తా' సినిమా తెరకెక్కుతోంది. 

Show comments