పాక్ సెలబ్రిటీలు.. ఇలా మాట్లాడుతున్నారేంటి!

ఒకవైపు పాకిస్తానీ రాజకీయ నేతలు, మిలటరీ అధికారులేమో.. ధాం, ధూం..అంటుంటే, పాకిస్తానీ సెలబ్రిటీలు మాత్రం శాంతి మంత్రాలు వల్లెవేస్తున్నారు. ఊడీ సంఘటన , ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో… పాకిస్తానీ క్రికెటర్లు, కళాకారులు శాంతమంత్రాన్ని పఠిస్తున్నారు. వీరిలో పాక్ సంచలన క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ, కమేడియన్ షహజాద్ ఘీయాస్ వంటి వారు స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది.

అఫ్రిదీనేమో.. యుద్ధం ఇరు దేశాలకూ మంచిది కాదు, ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి చర్చల అవకాశం ఉందని అంటున్నాడు. ఇక ఘీయాస్ అయితే.. ఎంతో వేడి మీద ఉన్నవారి మనసులను కూడా నవ్వించే కవిత్వం తరహా మాటలతో.. శాంతి అంటున్నాడు.

భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలను సాస్ బహూ సీరియల్ గా అభివర్ణించాడు. ఇండియా, పాకిస్తాన్ రాజకీయాలు, సినిమాలు తదితర అంశాల గురించి ప్రస్తావిస్తూ ఘీయాస్ పెట్టిన ఫేస్ బుక్ పోస్టు ఒకటి పాక్ లో కన్నా.. ఇండియాలోనే బాగా పాపులర్ అయ్యింది. 

మోడీ- పాక్ అధ్యక్షుడికి వంటపోటీలు పెడదాం, అస్మిత్ పటేల్ కు- పాకిస్తానీ యంకర్ మీరాకు మధ్య ముద్దుల పోటీలు పెడదాం, రాహుల్ –బిల్వాల్ లకు హిందీ-ఉర్దూల్లో స్పెల్ బీ పోటీలు పెడదాం.. కానీ యుద్ధం మాత్రం వద్దు… అంటూ లైటర్ వెయిన్ లో సునిశిత హాస్యం పండించాడితను. 

అయినా ఇన్నేళ్లలో పాక్  ప్రజానీకానికి ఇండియా నుంచి ఎలాంటి ముప్పూ తలెత్తలేదు కాబట్టి.. వీళ్లు ఇలాగే మాట్లాడగలరు. నొప్పి ఎలా ఉంటుందో భారతీయ సెలబ్రిటీల స్పందనను చూసి అర్థం చేసుకోవాలి. సైన్యం స్పందన పట్ల మనోళ్లు గర్వంగా స్పందిస్తున్నారు. 

Show comments