ఎన్టీఆర్ సినిమాకు ​'​బాహుబలి సెలవులు​'​

బాహుబలి-2 సినిమా కోసం కార్పొరేట్ కంపెనీలు కొన్ని బల్క్ గా టిక్కెట్లు బుక్ చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని సంస్థలైతే శుక్ర, శనివారాలు సెలవులు కూడా ప్రకటించాయి. ఎన్టీఆర్ కూడా తన యూనిట్ కు సెలవులు ప్రకటించాడు. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. తిరిగి మే 6 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నాడు.

నిజానికి ఎన్టీఆర్ షూటింగ్ బ్రేక్, బాహుబలి-2 రిలీజ్ రెండూ కాకతాళీయంగా అలా కలిశాయి. దాదాపు నెల రోజులుగా ఏకథాటిగా "జై లవకుశ" ప్రాజెక్టుపైనే ఉన్నాడు ఎన్టీఆర్. మండే ఎండల్లో కూడా షూటింగ్ చేశారు. ఓ వైపు ఎండలు మరీ పెరిగిపోవడం, మరోవైపు లాంగ్ షెడ్యూల్ కావడం, ఇంకోవైపు బాహుబలి-2 రిలీజ్ అవ్వడం.. అందుకే షూటింగ్ కు వారం రోజుల పాటు విరామం ప్రకటించారు.

ఈ వారం రోజుల గ్యాప్ లో తనకు ఎంతో ఆప్తుడైన రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమాను కచ్చితంగా చూస్తాడు ఎన్టీఆర్. బాహుబలి-2 రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు ఐఫా అవార్డుల వేదికపైనే రానాను ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడిన విషయం తెలిసిందే.

Show comments