ఉయ్యాలవాడ కోసం చిరంజీవి మేకోవర్

చిరంజీవి 151వ ప్రాజెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మేకోవర్ పనిలో ఉన్నారు చిరు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి డిఫరెంట్ గా వచ్చారు చిరంజీవి. గడ్డం పెంచి, దాన్ని ట్రిమ్ చేసి కనిపించారు. ఇదే విషయాన్ని హాట్ సీట్ లో కూర్చున్న వ్యక్తి అడిగారు. ఒకప్పటి గ్యాంగ్ లీడర్ లుక్స్ లో కనిపిస్తున్నారు ఏంటి విషయం అని సూటిగానే ప్రశ్నించాడు. దీంతో చిరంజీవి అసలు విషయం చెప్పాల్సి వచ్చింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కోసం గడ్డం పెంచారట చిరంజీవి. ఈ మేకోవర్ తో ఫొటోషూట్ కూడా నిర్వహించారు. త్వరలోనే మరో 2-3 గెటప్స్ లో ఫొటోషూట్స్ నిర్వహించి.. ఫైనల్ గా ఓ గెటప్ కు ఫిక్స్ అవుతారట. ఈ గ్యాప్ లో స్టోరీని కూడా లాక్ చేయబోతున్నారు.

అప్పుడప్పుడు గడ్డం పెంచడం చిరంజీవికి అలవాటే. కానీ ఈసారి మాత్రం కేవలం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసమే గడ్డం పెంచుతున్నారు చిరు. చిరంజీవి నయా లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే.

Show comments