దర్శకుడు దాసరి నారాయణ రావు అమ్మ అనే పేరుతో సినిమా తీస్తానని ఆ మధ్య ప్రకటించారు. జయలలిత మరణం తరువాత ప్రకటించడంతో అది ఆమె బయో పిక్ అవుతుందని అనుకున్నాంతా. కానీ కానే కాదట. కానీ జయలలిత కథనే పోలి వుంటుందట. ఓ మహానాయకురాలి ఉద్దాన పతనాలు అన్నీ అందులో వుంటాయట.
బహుశా నేరుగా బయోపిక్ అంటే చాలా సమస్యలు వస్తాయి. పైగా దాసరి ఏమంటున్నారు, జయలలిత బయోపిక్ అంటే మిగిలిన క్యారెక్టర్లు కూడా కావాలి. ఎమ్జీఆర్, కరుణానిధి, శోభన్ బాబు. ఇవన్నీ అంటే బోలెడు సమస్యలు. పైగా ఫ్రీడమ్ వుండదు. ఇప్పుడు కేవలం జయలలిత క్యారెక్టరైజేషన్ సెంటర్ పాయింట్ గా తీసుకుని, దాని చుట్టూ సినిమాటిక్ లిబర్టీతో కథ అల్లుకోవచ్చు.
నిజానికి దాసరి అయిడియా మంచిదే. లేదంటే, వంగవీటి మాదిరిగా బోలెడు తలకాయనొప్పులు. పైగా దాసరి మరో మాట కూడా చెప్పారు. రఘుపతి వెంకయ్య బయోపిక్ తీస్తే, చూసేవారు లేరు, శాటిలైట్ కొనేవారు లేరు అని. అందుకే ఆయన అమ్మ పేరుతో జయలలిత కథను మాంచి సినిమాగా మార్చాలని అనుకుంటున్నట్లుంది. మంచి అయిడియానే.