నాగచైతన్య సేమ్ ఫార్ములా

2016 నాగచైతన్యకు బాగానే కలిసొచ్చింది. మరీ అంతకుముందు ఏడాదిలా అట్టర్ ఫ్లాపులైతే లేవు. ప్రేమమ్ తో డీసెంట్ హిట్ అందుకున్నాడు. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో బిలో యావరేజ్ హిట్ కొట్టాడు. ఇలా చూసుకుంటే 2015తో పోలిస్తే 2016లో నాగచైతన్య కెరీర్ చాలా బాగున్నట్టు లెక్క. సో.. ఈ ఏడాది కూడా అదే ఫార్ములా ఫాలో అయిపోవాలని ఫిక్స్ అయిపోయాడు చైతూ. రెండు సినిమాలు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. 

ఇందులో భాగంగా ఇప్పటికే 2 సినిమాల్ని లైన్లో పెట్టాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మోడ్ లో ఉంది. దీంతో పాటు కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమాను కూడా స్టార్ట్ చేశాడు చైతూ. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లోనే ఉన్నాడు చైతూ. ఇలా ఈ ఏడాది కూడా 2 సినిమాలు రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

అయితే నాగచైతన్య తలుచుకుంటే ఈ ఏడాది మరో సినిమా కూడా రెడీ చేసే ఛాన్స్ ఉంది. కానీ చైతూ మాత్రం 2 సినిమాలకే ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే, త్వరలోనే సమంతను పెళ్లాడనున్న ఈ హీరో, కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా, వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. మహా అయితే ఈ గ్యాప్ లో గెస్ట్ ఎప్పీయరెన్స్ మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉంది.

Show comments