టాలీవుడ్ కు కేసిఆర్ కావలెను

అవును నిజమే..ఇప్పుడు సినిమా రంగానికి ఓ కేసిఆర్ కావాలి. ఎందుకంటే కేసిఆర్ పై సినిమా తీయాలని ఇద్దరు నిర్మాతలు డిసైడ్ అయిపోయారు. పెళ్లిచూపులతో హిట్ కొట్టిన రాజ్ కందుకూరి వారిలో ఒకరు. అయితే ఈ సినిమా కెసిఆర్ బయోపిక్ మాదిరిగా వుండదు. కేసిఆర్ సాధించిన విజయాల ఆధారంగా కథ తయారుచేసుకుంటున్నారు. ఆ మేరకే సినిమా వుంటుంది. 

అయితే అసలు సంగతి ఏమిటంటే, మరి కెసిఆర్ పాత్రను ఎవరు పోషిస్తారు? అచ్చంగా కేసిఆర్ మాదిరిగా వుండే కొత్త లేదా పాత నటుడు ఎవరైనా కావాలి. రామ్ గోపాల్ వర్మ అయితే ఇలాంటివి టక్కున పట్టుకుంటారు. తెలంగాణ మొత్తం మీద కెసిఆర్ లా కనిపించే వాళ్లు ఒక్కరన్నా వుండకపోతారా? అదీ కాక ఈ సినిమా జూన్ తరువాత మొదలవుతుంది. 

అందువల్ల ఏడెనిమిది నెలలు టైమ్ వుంది కేసిఆర్ దొరకడానికి. ఈలోగా రాజ్ కందుకూరి మరో రెండు, మూడు ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లి చూపులు డైరక్టర్ లో సురేష్ బాబుతో కలిసి సైన్మా, మరో షార్ట్ ఫిలిమ్ డైరక్టర్ కు చాన్స్ ఇస్తూ మరో చిన్న సినిమా, విజయ్ దేవరకొండతో ఇంకో సినిమా. ఆ లోగా కేసిఆర్ పాత్రకు ఎవరో ఒకర దోరికేస్తారానే ధీమా వుందట.

Show comments