‘సుల్తాన్’ తో సల్మాన్ కు దక్కింది రూ.144 కోట్లా..?!

ఒకే ఒక్క సినిమాతో హీరో ఇంత పారితోషకం పొందగలడా? అనే ఆశ్చర్యం కలగకమానదు “సుల్తాన్’’ సినిమా లెక్కలు వింటుంటే. ఈద్ సందర్భంగా విడుదలైన ఈ సినిమా 35 రోజులు పూర్తి అయిన నాటి లెక్కల ప్రకారం చూస్తే.. సల్మాన్ కు గరిష్టంగా 144 కోట్ల రూపాయలు దక్కి ఉండే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు! ఏదో గాలి లెక్కలు కాకుండా.. వీరు మొత్తం వివరాలను చెప్పి మరీ సల్మాన్ వాటా ఆ స్థాయిలో ఉందని అంటున్నారు.

ఆసక్తికరమైన ఈ గణాంకాలు ఇలా ఉన్నాయి. 

సుల్తాన్ మేకింగ్ కు అయిన ఖర్చు – రూ.70 కోట్లు
ప్రచారానికి పెట్టిన ఖర్చు – రూ.20 కోట్లు
ఓవరాల్ గా ప్రొడక్షన్ ఖర్చు రూ.90కోట్లు (70+20)
ఇండియాలో వసూళ్లు(35 రోజులు పూర్తయ్యే సరికి అంచనా)- రూ.300 కోట్లు
ఇందులో డిస్ట్రిబ్యూటర్ల వాటా- రూ.135 కోట్లు(అంచనా)
ఓవర్సీస్ వసూళ్లు (ఆగస్టు ఏడో తేదీకి అంచనా)- రూ.163 కోట్లు
ఇందులో డిస్ట్రిబ్యూటర్ల వాటా- రూ.73 కోట్లు(అంచనా)
హోమ్ వీడియో, ఆడియో,డిజిటల్, ఇతర రైట్లు-రూ.12 కోట్లు
శాటిలైట్ ధర- రూ.50 కోట్లు

ఈ మొత్తాలన్నీ కలుపుకుంటే.. ఈ సినిమాను తీసిన యశ్ రాజ్ సంస్థ నికరంగా రూ.270 కోట్ల రూపాయల పై స్థాయిలో డబ్బు వచ్చిందని అంటున్నారు . ఇక డిస్ట్రిబ్యూటర్ల విషయానికి వస్తే.. రెండువందల కోట్ల వరకూ వారు పొందారు.  Readmore!

యశ్ రాజ్ సంస్థకు వచ్చిన రూ.270 కోట్ల పై చిలుకు మొత్తంలో మేకింగ్ కోసం వెచ్చించిన రూ.90 కోట్లను మైనస్ చేస్తే.. ఈ సంస్థ చేతిలో రూ.180 కోట్లు మిగిలినట్టే. ఈ మొత్తంలో మెజారిటీ వాటా మాత్రం సల్మాన్ దేనట! సినిమా కథ, కథనాలతో సంబంధం లేకుండా మార్కెట్ జరుగుతుంది కాబట్టి.. ఇందులో మెజారిటీ వాటాపై సల్మాన్ కు హక్కులుంటాయనేది బాలీవుడ్ మాట. ఆ వాటా ఎంతో క్లారిటీ లేదు కానీ.. కనీసం 50 శాతం నుంచి 80 శాతం మొత్తం సల్మాన్ వాటా కిందే పోతుందని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఏ సినిమా విషయంలో అయినా లాభాల నుంచి 50 శాతం నుంచి 80 శాతం మొత్తాన్ని సల్మాన్ పారితోషకంగా అందుకుంటున్నాడట. 

ఈ ప్రకారం చూస్తే.. ఆ రూ.180 కోట్ల నుంచి కనిష్టం గా రూ.90 కోట్లు గరిష్టంగా.. రూ.144 కోట్ల రూపాయల పారితోషకాన్ని సల్మాన్ పొందాడనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. మరి ఇవన్నీ 35 రోజుల నాటి లెక్కలే అయితే.. ఇంకా రన్ ఉంది కాబట్టి.. సుల్తాన్ అసలు లెక్క లు ఏ స్థాయిలో ఉంటాయో!

Show comments

Related Stories :