బత్తాయి కాయల బాబ్జీ...పృధ్వీ

థర్టీ ఇయర్స్ పధ్వీ..ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ అనడంలో డౌట్ అక్కరలేదు. బ్రహ్మానందం సైడ్ అయిపోయారు. మిగిలిన వారి సంగతి అలా వుంచితే, ఇప్పుడు రైటర్లకు హాట్ చాయిస్ గా మారాడు పృధ్వీ. గతంలో బ్రహ్మీ కోసం కాన్సెప్ట్ క్యారెక్టర్లు తయారుచేసినట్లే, ఇఫ్పడు పృధ్వీ కోసం తయారుచేస్తున్నారు. 

త్వరలో విడుదల కాబోయే బాబు బంగారం సినిమాలో పృద్వీ బత్తాయి కాయల బాబ్జీ గా కనిపిస్తారట. అసలే పృధ్వీకి అమ్మా నా బత్తాయో అనడం ఊతపదం. కానీ దాన్ని ఈ సినిమాలో వాడలేదట. అయితే ఏదయినా, మంచి, చెడు, సంతోషం, దుఖం అన్నింటినీ బత్తాయి ప్రమేయం లేకుండా మాట్లాడదట ఈ క్యారెక్టర్. రష్ చూసిన జనాలు ఈ సినిమాతో పృధ్వీ మరో మెట్టు పైకి ఎక్కుతాడంటున్నారు. 

సినిమా తొలిసగం అంతా పృధ్వీ తన కామెడీతో కదం తొక్కేస్తాడట. మళ్లీ క్లయిమాక్స్ లో దర్శనమిస్తాడట. రాబోయే సెల్ఫీ రాజాలో కూడా పృధ్వీ మంచి క్యారెక్టరే వేసేసాడు..బన్నీ మాదిరిగా చెప్పను బ్రదర్ అంటూ.

Show comments